కన్నడ కిరాక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న తెలుగులో ఛలో సినిమాతో సంచలన విజయం అందుకుంది. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమా కూడా ఆమెకు మరింత ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక ఈమధ్యనే సూపర్ స్టార్ మహేష్ తో లక్కీ ఛాన్స్ పట్టేసింది.
అనీల్ రావిపుడి డైరక్షన్ లో మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న రష్మిక ఓ పక్క సొంత భాషలో కూడా ఛాన్సులు కొట్టేస్తుంది. ఇదిలాఉంటే తనకు తమిళ హీరో విజయ్ తో నటించాలని ఉందని అమ్మడు అన్నది. కోలీవుడ్ లో కూడా రష్మిక ఫ్యాన్స్ ఉన్నారు.
వారంతా రష్మిక కోలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే విజయ్ తర్వాత సినిమాలో రష్మిక హీరోయిన్ అని ప్రచారం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. అయితే అది నిజం అయితే బాగుంటుందని క్లారిటీ ఇచ్చింది. విజయ్ సినిమాలో తను నటిస్తుందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నమాట. అయితే విజయ్ తో తను నటించాలన్న కోరికను ఏ డైరక్టర్ తీరుస్తాడో అనుకుంటుంది రష్మిక.
అందం అభినయం రెండు కలిసి ఉన్న రష్మిక కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే అక్కడ కూడా వరుస ఛాన్సులు కొట్టేయడం ఖాయమని చెప్పొచ్చు. అయితే విజయ్ కు పర్ఫెక్ట్ పెయిర్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న హీరో సినిమాలో కూడా విజయ్ సరసన రష్మిక నటిస్తుందని అంటున్నారు. మరి చూస్తుంటే రష్మికను విజయ్ కూడా ఇప్పుడప్పుడే వదిలేలా లేడు. ఈ సినిమాతో పాటుగా నితిన్ భీషంలో రష్మిక సెలెక్ట్ అయ్యింది.