ఆరుగురు అమ్మాయిలు! అమాయకుడిని ముద్దులతో నలిపిపారేశారుగా..?

Chakravarthi Kalyan
ఒక సినిమాలో ఒకరో ఇద్దరో హీరోయిన్లు ఉంటారు. మహా అయితే ముగ్గురు.. కానీ ఒకే సినిమాలో ఆరుగురు హీరోయిన్లు.. ఒక హీరో అయితే.. పరిస్థితి ఎలా ఉంటుంది. అందులోనూ అందరు హీరోయిన్లతో లిప్ లాక్ కిస్సులుంటే.. ఎలా ఉంటుంది.. ఇక రోమాన్సే రోమాన్స్ కదా.. 


త్వరలో తెలుగు తెరపైకి రాబోతున్న సినిమా 7 అలాంటిదేనట. నువ్విలా సినిమాతో పరిచయమైన హవీశ్ ఇందులో హీరో. క్రైమ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సిినిమాలో రొమాన్సుకు కొదువ లేదట. పాపం.. ఆ హీరో హవీశ్.. ఆరుగురు అమ్మాయిలకు లిప్ లాక్ కిస్సులు ఇవ్వలేక ఇబ్బందిపడిపోయాడట. 

సాధారణంగా థ్రిల్లర్ అనగానే డ్రైగా, ప్రేమకథ లేకుండా టెన్షన్ టెన్షన్‌గా ఉంటాయి. 'సెవెన్' మాత్రం అలా ఉండదట. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తరహాలో ఉంటుందంటున్నాడు హవీశ్.  సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. అంతమందిని పెట్టుకుని డ్రైగా సినిమా తీయలేం కదా. లవ్, రొమాన్స్ ఉన్నాయని క్లారిటీ ఇస్తున్నాడు. 

అసలు ఈ సినిమాలు ముద్దు సీన్లు ఉన్నాయని తనకు ముందు చెప్పలేదట. తొలిరోజు షూటింగులో ముద్దు పెట్టమన్నారు. నేను పెట్టను. ముందు నాకు చెప్పలేదు. హీరోయిన్ కొడితే ? ఏం చేయాలి?’ అని అడిగాడట అమాయకంగా. పాపం కుర్రాడు హీరోయిన్లను నేను ముట్టుకోనే లేదట. 

అందుకే మొదటి రోజు ముద్దు సీన్ చేయలేకపోయాట. కానీ.. తర్వాత రోజు నిర్మాత వచ్చి సీరియస్ అయ్యారట. దాంతో కుర్రాడికి ముద్దుల్లోకి దిగక తప్పలేదట. తనకు హీరోయిన్‌ని ముట్టుకోవాలంటే భ‌యం వేసేదట. ఇంతకు ముందు వారితో పరిచయం కూడా లేదు కదా.. అందుకే సన్నివేశాలకు హీరోయిన్ మారిన ప్రతిసారీ భయపడేవాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: