తన కూతురు గురించి సంచలన ట్వీట్ చేసిన మహేష్ బాబు..!
ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు ఏవీ కూడా ఇప్పటివరకు ఒక్క వీడియో మినహా బయటకు రాకపోవడంతో తాజాగా మహేష్ బాబు ఈ సినిమా గురించి మరియు తన కూతురు సితార గురించి కొన్ని విశేషాలు ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. హైదరాబాదులో జరుగుతున్న మహర్షి సినిమా షూటింగ్ సెట్లో గారాలపట్టి సితార మండు వేసవిలో తన చిట్టి పొట్టి మాటలతో ఆహ్లాదాన్ని అందిస్తోంది అని పేర్కొన్నారు మహేష్.
‘నా సితా పాపతో ఛోటి ఛోటి బాతే. ఎల్లప్పుడూ నాలోని ఒత్తిడిని పోగొడుతుంది. ఆన్ సెట్స్ మహర్షి’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతే కాకుండా మరొక పక్క ‘మహర్షి’ సెట్స్‌లో సితారతో సరదాగా గడిపిన కొన్ని ఫొటోలను మహేష్‌బాబు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. భరత్ అనే నేను సినిమా తర్వాత వస్తున్న సినిమా నేపథ్యంలో ‘మహర్షి’ సినిమాపై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు మహేష్ అభిమానులు.