నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని కుటుంబకోడలుగా మారిన తరువాత కూడ వరుస ప్రయోగాలతో సమంత తన స్పీడ్ ను కొనసాగిస్తూ ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తూనే ఉంది. ‘రంగస్థలం’ లో రామలక్ష్మిగా మహానటిలో జర్నలిస్టు మధురవాణిగా డిఫెరెంట్ పాత్రలలో నటించి మెప్పించింన సమంత ‘యూటర్న్’ మూవీలో తన నటనతో మెప్పించి ఆకట్టుకున్నా ఆసినిమా పెద్దగా విజయవంతం కాలేదు.
చైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత మొట్టమొదటిసారి అతడితో కలిసి నటిస్తున్న శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందింపబడుతున్న సినిమాలో చైతన్యతో గొడవపడే గృహిణిగా మరో వైవిధ్యమైన పాత్రలోనటిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఈప్రయోగాలను మరింత కొనసాగించడానికి సామ్ తన తదుపరిసినిమాను నందిని రెడ్డి దర్శకత్వంలో చేస్తోంది.
కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ కి రీమేక్ గా నిర్మింప పడుతున్న ఈసినిమాలో 70 ఏళ్ల వృద్ధురాలు 20 వయసుగల అమ్మాయిగా మారిపోవాలని కలలుకనే విచిత్రమైన పాత్రలో సమంత నటిస్తోంది. 70 ఏళ్ళ వయస్సు గల ఒక మహిళా ఏళ్ళ 20 వయసుగల అమ్మాయిగా మారిపోవడం ఒక ట్విస్ట్ అనుకుంటే ఆపాత్రకు 50ఏళ్ళ వయసు కొడుకు ఉంటే ఎలా ఉంటుంది ? అన్న ఆక్తికర సన్నివేశాలు ఈమూవీలో ఉంటాయి.
ఈ 50ఏళ్ళ కొడుకు పాత్రలో విలక్షణ నటుడు రావు రమేష్ సమంతకు కొడుకుగా నటించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. అసక్తికరమైన ట్విస్టు ఉండే ఈ సినిమాలో రావు రమేశ్ పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా సమంత రావు రమేష్ పాత్రల మధ్య సంఘర్షణ అద్భుతంగా మలచపడ్డ ఈసినిమాకు ‘ఓ బేబి’ అనే టైటిల్ ని పెడుతున్నట్లు సమాచారం. ఈమూవీలోని తన పాత్రకు జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుంది అని సమంత భావిస్తున్నట్లు టాక్..