బయటపడ్డ నాని నిజ స్వరూపం !

Seetha Sailaja
ఎంత గొప్ప వ్యక్తికి అయినా అంతరంగాలలో మాస్ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి అని మానసిక వైద్యులు చెపుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి సందర్భమే హీరో నానీకి వచ్చింది. నేచురల్ స్టార్ గా మంచి క్లాస్ ఇమేజ్ ఉన్న నాని నిన్న అనుకోకుండా ఒకేసారి తనలోని మాస్ మెంటాలిటీని బయటకు తీసి అందరికీ షాక్ ఇచ్చాడు. 

నిన్న విడుదలైన ‘2.ఓ’ మూవీని మొదటిరోజు మొదటి షో చూడాలని నానీ భావించినా తన లేటెస్ట్ మూవీ ‘జెర్సీ’ షూటింగ్ వల్ల కుదరక నిన్న రాత్రి ‘2.0’ షోను చూసాడట నాని. ఆసినిమా అతడికి విపరీతంగా నచ్చడంతో ‘‘బాక్సాఫీసుకు దిగిపోద్ది'' అంటూ పెట్టిన ట్విట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. 

క్లాస్ సినిమాలు చేసే నాని నోటి వెంట ఈమాస్ మాటలు ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్య పోతున్నారు. ఈమూవీలో రజనీకాంత్ అక్షయ్ కుమార్ శంకర్ అదరగొట్టారంటూ నాని తన అభిమానాన్ని వ్యక్త పరుస్తూ ఇలా తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు. 

అంతేకాదు చాలాకాలం తరువాత తాను ఒక సినిమాను చూసి చిన్న పిల్లవాడిలా మారిపోయి ఎంజాయ్ చేసాను అంటూ నాని చేసిన ట్విట్ ను చూసినవారికి అతడిలోని చిన్న పిల్లవాడి మనస్తత్వం కనిపిస్తుంది. రాజమౌళిలానే ఒక మంచి సినిమా ఎవరు చేసినా ఆ నటించిన వాళ్ళు కొత్తవాళ్ళు అయినా ఎటువంటి భేషజాలకు పోకుండా ప్రశంసించే మంచితనం నానీకి ఉంది అంటూ చాలామంది చెప్పే విషయానికి నాని లేటెస్ట్ ట్విట్ ఒక ఉదాహరణ అనుకోవాలి. దీనితో నానీని అనుసరిస్తూ ఇంకా ఎంతమంది టాప్ హీరోలు ‘2.ఓ’ పై తమ అభిప్రాయాన్ని ఇలా వెల్లడిస్తారో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: