మంచి మనసు చాటుకున్న మహేష్.. 106 ఏళ్ల అభిమాని కోరిక తీర్చాడు..!

shami
సూపర్ స్టార్ మహేష్ తో ఒక ఫోటో దిగాలని కొద్దిరోజుల క్రితం రాజమండ్రికి సంబందించిన రేలంగి సత్యావతి తన మనసులోని కోరికను మీడియా ముందు బయటపెట్టింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ విషయం మహేష్ దాకా చేరింది. అమెరికాలో మహర్షి షూటింగ్ టైంలో ఉండటం వల్ల సత్యవతి కోరికను తీర్చలేకపోయాడు మహేష్.


అందుకే హైదరాబాద్ వచ్చాక తన అభిమానిని పిలుపించుకుని మరి ఆమె కోరిక తీర్చాడు. 106 ఏళ్ల సత్యావతి మహేష్ అంటే ఎంతో అభిమానం ఆమె కోరిక మేరకు మహేష్ రాజమండ్రి తన అభిమానుల సహాయంతో ఆమెని తన దగ్గరకు చేరుకునేలా చేశాడు. హైదరాబాద్ లో మహర్షి షూటింగ్ స్పాట్ లో మహేష్ ఆమెను కలవడం జరిగింది.


మహేష్ ను చూసిన క్షణం ఆమె కన్నీళ్లతో భాదోద్వేగమయ్యారు. 106 ఏళ్ల వయసు కలిగిన ఆమె తన వయసులో సగం కన్నా చిన్నోడైన మహేష్ ను చూసేందుకు పడిన తపన ముచ్చటేస్తుంది. మహేష్ ఆమె బాగోగులు తెలుసుకుని ఆమె రాకపోకలకు సంబందించిన అన్ని ఖర్చులు చూసుకున్నాడట.


అంతేకాదు సెట్ లో ఆమెకు భోజనం కూడా ఎరేంజ్ చేశాడట. ఆమెతో వచ్చిన వారిని మహేష్ ఎంతో ఆప్యాయంగా పలుకరించాడని తెలుస్తుంది. తన ఫ్యాన్ కోరిక తీర్చిన మహేష్ మంచి మనసుని అందరు అభినందిస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ ను కలిసి మాట్లాడినప్పుడు నిజంగా స్టార్స్ అవడం ఎంత అదృష్టం అన్నది తెలుస్తుంది.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: