ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి బాలకృష్ణ అనుసరిస్తున్న వ్యూహాలతో ఈమూవీ పై క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా బాలకృష్ణ పరుగులు తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి అలనాటి ఎన్టీఆర్ వేటగాడి గెటప్ ను ఈరోజు నందమూరి అభిమానులకు తిరిగి బాలయ్య గుర్తుకు చేసాడు.
అయిపోయిన దసరా రాబోతున్న దీపావళి శుభాకాంక్షలను తన అభిమానులకు తెలియచేస్తూ బాలయ్య వదిలిన వేటగాడి గెటప్ పోస్టర్ ఈరోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రి ఎన్టీఆర్ ను అనుకరిస్తూ ఆరోజులలో యూత్ విపరీతంగా వేసుకుని అలనాటి బెల్ బాటమ్ ప్యాంట్ లుక్ తో బాలయ్య అదరగొట్టాడు.
‘వేటగాడి’ లుక్ లో కనిపిస్తున్న బాలకృష్ణ అచ్చం అలనాటి ఎన్టీఆర్ లా కనిపిస్తున్నాడు. అంతేకాదు ‘వేటగాడి’ సినిమాలోని ‘ఆకు చాటు పిందె తడిచే పాట కోసం అలనాటి శ్రీదేవిని గుర్తుకు చేసేలా రకుల్ ప్రీత్ తో వర్షంలో రోమాన్స్ చేయడమే కాకుండా ఈపాటలో నటించినందుకు రకుల్ కు కోటి రూపాయల పారితోషికం బాలయ్య ఇచ్చాడు అంతే బాలకృష్ణ ఈమూవీ స్థాయి గురించి ఏవిధంగా ప్రాకులాడుతున్నాడో అర్ధం అవుతుంది.
రాబోతున్న సంక్రాంతిని టార్గెట్ చేసుకుంటూ విడుదల కాబోతున్న ఈ బయోపిక్ బిజినెస్ విషయంలో సంచలనాలు సృష్టించడం ఖాయం అని అంటున్నారు. దీనికితోడు రానోతున్న సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పటికే బీటలు పడుతున్న తెలుగుదేశం దేలుగుదేసం పార్టీకి దన్నుగా నిలబడాలి అనే ప్రయత్నంగా రూపొందుతున్న ఈ ఎన్టీఆర్ బయోపిక్ విజయం తెలుగుదేశం పార్టీ వర్గాలకు అత్యంత అవసరం..