చెర్రీ కి టెన్షన్ – రిలయన్స్ కు రిలాక్స్

K Prakesh
జంజీర్ సినిమాను రిలయన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రేపు ‘తుఫాన్’ పేరు తో తెలుగులో కూడా రీమేక్ చేసి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాల నేపధ్యంలో ఈ సినిమా భవితవ్యం ఎలాగు ఉంటుందో అనే విషయం పై రకరకాల ఉహాగానాలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా రిజల్ట్ గురించి హీరో రామ్ చరణ్ కూడా టెన్షన్ పడుతున్నాడు.

మెగా అభిమానులు అయితే ఈ సినిమా విజయవంతం కావాలని పూజలు కూడా చేస్తున్నారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. కాని ఈ సినిమా నిర్మాణ సంస్థ రిలయన్స్ వారు మాత్రం ఎటువంటి టెన్షన్ లేకుండా తుఫాన్ ను రాజకీయ తుఫాన్ పరిస్థితులను కూడా లెక్క చేయకుండా విడుదల చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. కాని ఎటువంటి వ్యాపారాన్ని అయినా చాలా పకడ్బందీగా చేసే రిలయన్స్ సంస్థ తుఫాన్ సినిమాను ముందే ఇన్సూర్ చేయి౦చిందట. ప్రకృతి వైపరిత్యాలు, జనాందోళనలు లాంటి అనుకోని సంఘటనల రిత్యా సినిమా ప్రదర్శన ఆగిపోతే ఆ సినిమా నిర్మాతకు భారీ మొత్తంలో ఇన్సురెన్స్ క్లెయిమ్ అందుతుంది. ఈ ధైర్యం తోనే అటు సీమంధ్రలో ఇటు తెలంగాణా లో ఈ సినిమా విడుదల కు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వారికి వచ్చే నష్టం ఏమి లేదు కాబట్టి ధైర్యంగా రిలయన్స్ సంస్థ వారు తుఫాన్ ను ముందుకు తెస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

సామాన్యంగా సినిమా జయాపజయాల గురించి ఆ సినిమాను తీసిన నిర్మాతలు భయపడుతూ ఉంటారు. కాని ఇక్కడ ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ టెన్షన్ పడుతూ ఉంటే, నిర్మించిన రిలయన్స్ సంస్థ హ్యాపీ గా ఉండడం కొసమెరుపు. అందుతున్న తాజా సమాచారం ప్రకారం తుఫాన్ సినిమాకు పోలీస్ రక్షణ కూడా ఏర్పాటు చెయ్యమని రిలయన్స్ నిర్మాణ సంస్థ అడిగిన కోరికను న్యాయస్థానం వారు మన్నించినట్లుగా తెలుస్తోంది. తెలివిగా వ్యాపారం చేయడం కోట్లకోద్ది డబ్బు ఆర్జించడం మన దేశంలో రిలయన్స్ సంస్థ కు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలియదు అంటే ఇదే కాబోలు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: