ఏఎన్నార్ అడిగి చేసిన పాత్ర

HANUMA HANUMA
 ఏఎన్నార్ పాత్ర మిస్సమ్మలో చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆయన దాదాపు 250 సినిమాలు చేసి ఉంటే అందులో ఆయన అడిగి మరీ చేసిన పాత్ర ఒక్కటేనట. అది మిస్సమ్మలోని డిటక్టివ్ వేషమట. అందుకు కారణం కూడా ఉందట. ఆయన ‘దేవదాసు’ చేసిన తర్వాత అన్ని అలాంటి పాత్రలే వచ్చాయట.  ఆమూసలో నుంచి బయటపడాలన్న ఆలోచనతోనే చక్రపాణిని అడిగి మరీ ఈ సినిమా చేశారట. ఈ సినిమా గురించి అక్కినేని మాట్లాడుతూ ‘‘అప్పట్లో ఏఎన్నార్ ఇంత చిన్న పాత్ర వేయడమేంటి? డబ్బులకి అమ్ముడుపోయి వుంటాడు అని అనుకున్నారట. అయినా నేను పట్టించుకోలేదు. అందుకు కారణం మూస నుంచి బయటపడాలన్న ఉద్దేశమే’’ అని చెప్పారు అక్కినేని. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: