తమిళ సినీ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ కాంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ఒకప్పుడు విజయ్ కాంత్ సినిమాలు అంటే యూత్ కి బాగా నచ్చేవి. సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత విజయ్ కాంత్ పాలిటిక్స్ లోకి అడుగు పెట్టారు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసాడు విజయ్ కాంత్. డిఎండికే పార్టీ స్థాపించి కూడా ఓ సారి సంచలనం సృష్టించిన ఈయన.. ఆ తర్వాత పూర్తిగా తప్పుకుని సైలెంట్ అయిపోయాడు విజయ్‌కాంత్.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్ర బింధువుగా నిలిచారు విజయ్ కాంత్. ఆయన ఓడిపోయిన తర్వాత చాలా మంది ఓటర్లపై కూడా దురుసుగా ప్రవర్తించారని..తన సహనాయకుల పట్ల కూడా సరిగా వ్యవహరించేవారు కాదని టాక్. ఆ మద్య విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంగా..అమెరికాలో చికిత్స తీసుకున్నారు. రీసెంట్ గా ఆయన తమిళనాడుకు వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగా విషమించిందని అంటున్నారు. ఆ మద్య దివంగత నేత కరుణానిధి సమాధి వద్దకు నవడలేని స్థితిలో వచ్చారు.
ఇప్పుడు ఈయన్ని చూస్తుంటే అభిమానుల కంట కన్నీరు ఆగడం లేదు. ఒకప్పుడు సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సుల్లో అదరగొట్టిన ఈయన ఇప్పుడు మరొకరి సాయం లేకుండా నడవలేకపోతున్నాడు. ఇక నటనకు కూడా చాలా కాలంగా దూరంగానే ఉన్నాడు విజయ్‌కాంత్. ముఖ్యంగా మద్యానికి బానిసై ఈయన ఆరోగ్యం ఇప్పుడు క్షీణించిందని చెబుతున్నారు వైద్యులు. మొత్తానికి విజయ్‌కాంత్ అనేది ఇప్పుడు గతచరిత్రగా మిగిలిపోతున్నాడు. ఈయన ప్రస్తుతం మళ్లీ ఘనం కావాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం. తమ అభిమాన హీరో ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అభిమానులు చాలా ఆవేదన చెందుతున్నారు.