గత కొద్దిరోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో జరుగుతున్న రచ్చను చూసి చిరంజీవి తీవ్రంగా కలత చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘మా’ సంస్థ కమిటీ రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ఉండటంతో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఎక్కడ చూసినా ఈ 5.50 కోట్ల నిధి చుట్టూ వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఈఇష్యూని మెగాస్టార్ చిరంజీవి సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని భావించినా గొడవలతో ఈసీ సభ్యులంతా మీడియా కెక్కడంతో పెద్ద రచ్చగా మారి ‘మా’ అసోసియేషన్ తో సంబంధం లేనివారికి కూడ ఇది ఒక హాట్ న్యూస్ గా మారడం చిరంజీవికి ఏమాత్రం నచ్చలేదనీ వార్తలు వస్తున్నాయి. ఈవిషయాలకు సంబంధించి
ఇరు వర్గాలు ఆరోపణలు చేసుకుంటూ మధ్యలో తన పేరు లాగడం చిరంజీవికి చాల అసౌకర్యంగా మారిందని వార్తలు వస్తున్నాయి.
‘మా’ అసోసియేషన్ ఫౌండర్ ఛైర్మన్ గా చిరంజీవి గతంలో ఈసంస్థకు పనిచేయడంతో పాటు ఇప్పటికే 700 పైగా సభ్యులు ఉన్న అతిపెద్ద అసోసియేషన్ గా మారడంతో ఈసంస్థ సంబంధించిన ప్రతి విషయానికి తన పేరును లింక్ చేస్తూ చాలామంది మాట్లాడుతూ ఉండటం చిరంజీవికి తీవ్ర మనస్థాపానికి గురిచేస్తున్నట్లు టాక్. ఒక కుటుంబం వ్యవహారం లా ఇది తేల్చుకోకుండా శివాజీ రాజా నరేశ్ ల అత్యుత్సాహం వల్ల ఈవిషయం అందరికీ ఓపెన్ సీక్రెట్ లా మారిపోయింది అని చిరంజీవి తన సన్నిహితులతో బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనికితోడు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానెళ్లు నిజానిజాలేంటో గ్రహించకుండా ఈవిషయం పైనా మెగాస్టార్ పైనా ఇష్టానుసారం కథనాలు తయారు చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేయడం చిరంజీవికి విపరీతమైన చికాకును కలిగిస్తున్నట్లు టాక్. దీనితో అసహానానికి గురైన చిరంజీవి ‘మా’ సంస్థ అధ్యక్షుడు శివాజీ రాజాను తన వద్దకు పిలిపించుకుని ఈవిషయాల పై వీలైనంత త్వరలో అందరికీ అర్ధం అయ్యేలా క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఈవిషయాన్ని హుందాగా పరిష్కరించుకోమనీ భవిష్యత్ లో ఎక్కడా ఈవివాదంలో తన పేరు అనవసరంగా చర్చలకు వచ్చేలా ఆస్కారం ఇవ్వద్దని శివాజీ రాజాకు చిరంజీవి గట్టి క్లాస్ పీకినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు గుప్పు మంటున్నాయి..