
సైరా సక్సస్ కోసం బాహుబలి వ్యూహాలు !


ఈమూవీలో సుధీప్ రాజు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర గెటప్ ను ఇప్పుడు బయటకు వదిలారు. బాహుబలిలో కూడా సుదీప డిఫరెంట్ గెటప్ తో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పద్ధతిని అనుసరిస్తూ గతంలో ‘గోనగన్నారెడ్డి’ గా బన్నీ వేసుకున్న బ్లాక్ డ్రెస్, అలాగే బాహుబలిలో మాదిరిగా తలకు పాగా ఇలా ఈ రెండు సినిమాలలోని సెంటిమెంట్ ను సుదీప్ లుక్ కు వాడారు. ఇప్పటికే ఈమూవీకి సంబంధించి అమితాబ్ బచ్చన్, నయనతారల లుక్ బయటకు రావడంతో ఇప్పుడు ఇదే సినిమాలో నటిస్తున్న మిగతా నటీనటుల లుక్స్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రాబోయే సమ్మర్ ను టార్గెట్ చేస్తూ 2019లో విడుదలకు రెడీ అవుతున్న ఈమూవీ ద్వారా ‘బాహుబలి’ రికార్డులకు చెక్ పెట్టాలని చిరంజీవి చరణ్ లు కలిపి చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు విజయాన్ని ఇస్తాయో చూడాలి..