కేరళా ఇప్పుడు జలదిగ్భందంలో ఉన్న సంగతి తెలిసిందే. గత పదిరోజులుగా వరుసగా వస్తున్న భారీ వర్షాలతో కేరళా అతలాకుతలం అయ్యింది. ఎక్కడ చూసినా నీటితో మునిగిపోయింది. కేరళా వరదలు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపాలని కేరళ తల్లడిల్లుతోంది. భారీ వదలు కేరళను ముంచెత్తాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుని పోయాయి. కొన్ని ఇళ్లు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి. గ్రామాలు, పట్టణాళను వరదనీరు ముంచెత్తింది. దాదాపు 10 నుండి 15 అడుగల మేర నీళ్లు ప్రవహిస్తున్నాయి.
ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 350 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వృద్దులు చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహాయక బృందాలకు తలకు మించిన భారంగా తయారయింది. జాతీయ విపత్తు నివారణ సంస్థతో పాటుగా ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ దళాలు సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నప్పటికీ సరిపోవడం లేదు. ఇప్పుడు కేరళలో ధనవంతుడు పేదవాడు ఇద్దరూ ఒకటే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో ఆహార పదార్థాలన్నీ పాడైపోయి తిండికోసం అలమటిస్తున్నారు. అంతా వరద బాధితులుగా మారి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా నటుడు జయరామ్ ఇల్లు కూడా నీట మునిగిపోవడంతో ఆయన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అంతే కాదు తమిళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇల్లు కూడా నీటిలో మునిగిపోయింది. తన కాలనీలోని దుర్భరమైన దుస్తితి గురించి వీడియోలో తీసి షేర్ చేసి తన ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయిందని ఆమె వాపోయింది.
ఇల్లు వరదలో మునిగిపోవడంతో పెరంబావేరులోని తన స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుంటున్నామని అనన్య చెప్పుకొచ్చింది. ఇక మరో నటుడు సలీమ్ కుమార్ తన కుటుంబంతో పాటు చుట్టుపక్కల 50మందిని తన ఇంటిపైభాగంలో చేర్చాడు. వారంతా ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కేరళా వరద కష్టాల్లో ఇప్పుడు సెలబ్రెటీలు కూడా సతమతమవుతున్నారు.