మహేష్ చరణ్ లు తమమధ్య పెరిగిన స్నేహానికి గుర్తుగా వారిద్దరూ పలు సందర్భాలలో కలుస్తూ ఆవిషయాలకు సంబంధించిన ఫోటోలను మీడియాకు లీక్ చేస్తూ వారిద్దరిమధ్య పెరుగుతున్న మైత్రిని తమ అభిమానులకు తెలిసేలా చేస్తున్నారు. ఈమైత్రి ఇలా కొనసాగుతూ ఉండగానే చరణ్ మహేష్ కు ఊహించని ఝలక్ ఇవ్వడం మహేష్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.
గతంలో టాప్ హీరోల సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు 100 రోజులు ధియేటర్లలో ప్రదర్శింప బడ్డ సందర్భాలు అనేకం. కానీ ఇప్పుడు 100రోజులు కాదు కదా కనీసం వారంరోజులు కూడ సినిమాలు ఆడడం లేదు. రెండువారాలకే థియేటర్లలోకి వేరే సినిమా వచ్చేస్తోంది. వేల థియేటర్లలో ఒకేసారి టాప్ హీరోల సినిమాలను రిలీజ్ చేసి వారం రోజుల్లోనే 100 కోట్ల కలక్షన్స్ రాబట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు.
దీనితో టాప్ హీరోల మధ్య విపరీతమైన పోటీ పెరిగిపోయి సినిమాలో ఏమాత్రం లోపం కనిపించినా భయంకరమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం టాప్ హీరోల సినిమాలకు సమస్యగా మారింది. దీనితో ఇప్పుడు ఒకసినిమా 100రోజులు ఆడిందంటే వింతగా చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. గడిచిన వేసవి సీజన్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన చరణ్ ‘రంగస్థలం’ సృష్టించిన సంచలనం అందరికీతెలిసిందే.
ఈమూవీ బ్లాకు బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకొని రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఇదే సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ వెంటనే వచ్చిన మహేష్ ‘భరత్ అనే నేను’ కూడా బ్లాకు బస్టర్ హిట్ కావడంతో ఈరెండు సినిమాల కలక్షన్స్ మధ్య ఏర్పడిన పోటీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థుతులలో నిన్న ‘భరత్ అనే నేను’ ఆరు కేంద్రాలలో 100రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది అంటూ విడుదల చేయబడ్డ ప్రకటన మరొకసారి మహేష్ చరణ్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది. ఈసమ్మర్ రియల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘రంగస్థలం’ అంటూ చరణ్ అభిమానులు ‘రంగస్థలం’ శతదినోత్సవ సెంటర్లను మహేష్ ‘భరత్’ శతదినోత్సవ సెంటర్లతో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో పెరుగుతున్న స్నేహం మధ్య మరింత పెరుగుతున్న వీరిద్దరి సినిమాల పోటీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..