స్టార్స్ కు దీటుగా కొరటాల శివ రెమ్యునరేషన్.. నిర్మాతలు షాక్..!

shami
రచయితగా సూపర్ హిట్లు కొట్టిన కొరటాల శివ దర్శకుడిగా మారి వరుస సూపర్ హిట్లు కొడుతున్నాడు. ప్రభాస్ మిర్చి నుండి మహేష్ భరత్ అనే నేను వరకు కొరటాల శివ సినిమా అంటేనే సూపర్ హిట్ సినిమా అనే ముద్ర వేసుకున్నారు. అందుకే సినిమా సినిమాకు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచుతున్నాడు.


రాజమౌళి తర్వాత దర్శకుడిగా సూపర్ క్రేజ్ సంపాదించిన కొరటాల శివ మెసేజ్ తో కూడిన కథలను స్టార్స్ తో చెప్పిస్తున్నాడు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందినవే. మిర్చి కమర్షియల్ గా సక్సెస్ అయినా అందులో మెసేజ్ కాస్త తక్కువగా ఉంటుంది.


భరత్ హిట్ తర్వాత డిమాండ్ మరింత పెరగడంతో ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునరేషన్ కన్నా కొరటాల శివ 25% ఎక్కువ పెంచాడని తెలుస్తుంది. ఇప్పటికే 15 కోట్ల దాకా తీసుకుంటున్నాడన్న టాక్ ఉండగా ఇప్పుడు ఆ 25 శాతం అధికంతో కొరటాల శివ కూడా స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చెప్పొచ్చు.


తన తర్వాత సినిమా మెగాస్టార్ చిరంజీవితో ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు కొరటాల శివ. ఈ సినిమాను రాం చరణ్ తో పాటుగా నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఈ కథ కూడా రైతుల సమస్యల గురించి చెప్పే విధంగా ఉంటుందని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: