చికాగో సెక్స్ రాకెట్ ను పట్టించిన 14 లక్షలు !

Seetha Sailaja
క్యాస్టింగ్ కోచ్ వివాదం తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని అమెరికాలో నిర్వహించిన వ్యక్తులు ఎవరు అన్నది స్పష్టం అయినా ఈ సెక్స్ రాకెట్ లో ప్రధానపాత్ర పోషించిన హీరోయిన్స్ విషయమై రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ సంచలన విషయాల పై ప్రముఖ ఛానల్స్ టాలీవుడ్ ప్రముఖులు జర్నలిస్ట్ లతో చర్చాగోష్టులు నిర్వహిస్తున్నాయి అంటే ఈ సెక్స్ రాకెట్ విషయాలకు మీడియా ఎంత ప్రాముఖ్యత ఇస్తోందో అర్ధం అవుతోంది.

ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా ఒక ప్రముఖ పత్రికకు ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు శినివాజీ రాజ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఈ చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారం ఒక ప్రముఖ హీరోయిన్ దగ్గర హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దొరికిన 14 లక్షల నగదు వల్ల ఈవిషయం బయటపడింది అని టాక్.

గత కొంతకాలంగా నాలుగు తెలుగు సినిమాలలోను రెండు కన్నడ సినిమాలలోను నటించిన ఈ హీరోయిన్ అమెరికా నుండి తిరిగి వస్తూ తన వద్ద ఉన్న 14 లక్షలు విలువైన అమెరికన్ డాలర్స్ ను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మార్చుకోవడానికి ఆ హీరోయిన్ ప్రయత్నించినట్లు టాక్. అయితే ఆ ఎయిర్ పోర్ట్ అధికారులు ఆమె ప్రవర్తిస్తున్న తీరుకు అనుమానం రావడంతో ఆమెకు అంత ఎక్కువగా డాలర్లు అమెరికాలో ఎవరు ఇచ్చారు అన్న విషయమై ఆరా తీసినట్లు తెలుస్తోంది. 

దీనితో ఆమె సమాధానాలలో వచ్చిన తేడాతో అసలు విషయాల పై కూపీ లాగితే ఈ డొంక కదిలినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా నిన్న ఈవిషయమై చర్చాగోష్టి నిర్వహించిన ఛానల్ లో పాల్గొన్న అనేకమంది ఈమధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు బజారున పడుతోంది అని కామెంట్ చేయడమే కాకుండా ఇండియాలోని ఏభాషకు సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీకి లేని సమస్యలు టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే ఎందుకు వెంటాడుతున్నాయి అని కామెంట్ చేయడం ఇక్కడి కొస మెరుపు..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: