కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ టాక్.. నాని డబుల్ ధమాకా..!

shami
నాచురల్ స్టార్ నాని హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న సినిమా కృష్ణార్జున యుద్ధం. ఏప్రిల్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం తిరుపతిలో జరిగింది. ఇక ఈవెంట్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. నాని డ్యుయల్ రోల్ చేసిన ఈ సినిమాలో కృష్ణా విలేజ్ గెటప్ లో కనిపిస్తుండగా.. అర్జున్ రాక్ స్టార్ గా దర్శనమిచ్చాడు.


కనిపించిన అమ్మాయికల్లా ఐలవ్యూ చెప్పే కృష్ణా.. రాక్ స్టార్ కాబట్టి తన వెనుక అమ్మాయిలు పడుతున్నా పట్టించుకోని అర్జున్ ఇలా ఈ ఇద్దరి మధ్యనే కాదు వీరి వల్ల ఇబ్బంది పడిన వారికి జరిగిన యుద్ధమే ఈ కృష్ణార్జున యుద్ధం. షైన్ స్క్రీన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరిష్ పెద్ది నిర్మించారు.


సినిమా అవుట్ పుట్ చూశాక ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సినిమాను అవుట్ రైట్ కు కొనేశాడు. ఈమధ్య వచ్చిన తొలిప్రేమ సినిమా కూడా దిల్ రాజు అలానే కొని లాభాలు సాధించాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా అనిపించింది. 


కచ్చితంగా నాని హిట్ మేనియా కొనసాగించేలా ఈ సినిమా ఉంటుందని మాత్రం చెప్పేయొచ్చు. సినిమాలో నాని మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ తో అదరగొట్టాడని తెలుస్తుంది. హిప్ హాప్ తమిజ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: