ఆమెకు ఎలా చూపించాలో బాగా తెలుసు.. గుట్టు విప్పిన కెమేరామెన్.. !

Chakravarthi Kalyan
హీరోయిన్ అనగానే అందంగా ఉంటే సరిపోదు.. ఆ అందాన్ని సరిగ్గా ప్రొజెక్ట్ చేయగలగాలి.. ఏ యాంగిల్లో ప్రేక్షకులకు కిర్రెక్కించవచ్చో.. తెలిసి ఉండాలి.. ఎలాంటి ఫోజులు అస్సలు ఇవ్వగూడదో అవగాహన ఉండాలి.




ఇవన్నీ తెలిస్తేనే ఈ అందాల ప్రపంచంలో దూసుకుపోగలుగుతారు. ఇప్పటి హీరోయిన్లలో ఆ కిటుకులు బాగా తెలిసిన హీరోయిన్లలో కాజల్ ఒకరు. 


ఈ మాట చెబుతున్నది ఎవరో దారిన పోయే దానయ్య కాదు. ఆమెతో దాదాపు మూడు సినిమాలకు పని చేసిన ఓ కెమేరా మెన్. ఇటీవల ఓ ఇంటర్వ్యలో సదరు కెమేరామెన్ కాజల్ గ్లామర్ ఎవర్ నెస్ గురించి చెప్పాడు. కాజల్ అందాల గుట్టు విప్పాడు.. ఇప్పటి తరంలో ఇలాంటి అందాల అవగాహన ఉన్న అతికొద్ది హీరోయిన్లలో కాజల్ ఒకరట. 


కాజల్ కు తన రైట్ జోన్స్ ఎలా కెమేరా ముందు ప్రజంట్ చేయాలో బాగా తెలుసట. సినిమా షూటింగుల్లోనే కాదు.. ఫోటో సెషన్లలోనూ అందాల ప్రదర్శన గురించి కాజల్ చాలా శ్రద్ధ తీసుకుంటుందట.



అందుకేనేమో ఈ అందాల ముద్దుగుమ్మ ఇంత లాంగ్ కెరీర్ మెయింటైన్ చేస్తోంది. తెలుగులో లక్ష్మీ కళ్యాణంతోనూ.. తమిళంలో బొమ్మలాట్టమ్ తోనూ కాజల్ తెరంగేట్రమ్ చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: