నాగశౌర్య కు కౌంటర్ ఇచ్చిన బాలయ్య అభిమానులు !
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తున్న'ఛలో' మూవీకి ప్రీరిలీజ్ టాక్ బాగుండటంతో ఈసినిమాను చాలభారీగా ప్రమోట్ చేస్తున్నారు. దీనికితోడు ఈ మూవీ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం సినిమా ట్రైలర్ పాటలు హిట్ కావడంతో ఈచిత్రం పై మంచి హైప్ వచ్చింది. దీనికి కొనసాగిపుగా ‘ఛలో' టీం విజయవాడ వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి సిమ్స్ కళాశాలలో ఈ మూవీ చిత్ర యూనిట్ సందడి చేస్తున్న సందర్భంలో అక్కడ ఈమూవీ యూనిట్ సభ్యులకు నందమూరి బాలయ్య అభిమానుల నుండి ఊహించని షాక్ తగిలింది.
‘ఛలో' టీమ్ కు కౌంటర్ ఇస్తూ కొందరు విద్యార్థులు ‘జై బాలయ్య' అంటూ నినాదాలు చేశారు. దీనితో నాగశౌర్య కొద్దిసేపు షాక్ అయి ఆషాక్ నుండి తేరుకుని తన వెంట ఉన్న తన సోదరుడు చేత జైబాలయ్య అంటూ బిగ్గరగా నినాదాలు చేసి వారిని ఉత్సాహపరిచాడు. అయితే అప్పటి కూడ బాలకృష్ణ అభిమానులు శాంతించకపోవడంతో నాగశౌర్య రంగంలోకిదిగి ‘జైబాలయ్య జై ఎన్టీఆర్, జై చిరంజీవి, జై పవన్ కళ్యాణ్ జై అనుష్క’ అంటూ కవర్ చేసి తాము అంతా ఒకటే తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవు అంటూ అరుపులు అరుస్తున్న విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశాడు.
అనుకోని ఈ సంఘటనను చూసిన మీడియా వర్గాలు కూడ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి బాలయ్య అభిమానులు నాగ శౌర్య పై ఇలా ప్రవర్తించడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది అని అంటున్నారు. ఈ మధ్య ‘ఛలో' మూవీ ఆడియో వేడుకకు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంలో నాగ శౌర్య మాట్లాడుతూ చిరంజీవిని ఉద్దేశించి భావోద్వేగమైన ప్రసంగం చేశాడు.
‘చిరంజీవిగారు యాక్ట్ చేసిన రోజుల్లో నెం.1, నెం. 2, నెం.3, నెం.4 ఇలా నాలుగు కుర్చీలు ఉండేవి. ఆయన వెళ్లిపోయిన తర్వాత కుర్చీలు లేవు, అందరూ నిల్చోవడమే, మళ్లీ మెగాస్టార్ వచ్చారు, కుర్చీ తెచ్చుకున్నారు, ఆయనే వేసుకుని కూర్చున్నారు ఇక ఎవరూ రారు, రాలేరూ, కూర్చోలేరు. ఆ కుర్చీ ఆయనది కాదు, ఆయన కోసమే కుర్చీ పుట్టింది’ అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఉపన్యాసమే బాలకృష్ణ అభిమానులకు కోపం తెప్పించి నాగ శౌర్యను టార్గెట్ చేసే విధంగా మారింది అని అంటున్నారు. ఏమైనా నాగ సౌర్య అత్యుత్సాహం అతడికి అనుకోని సమస్యలు తెచ్చిపెట్టిందను కోవాలి..