నాని పై రాజమౌళి అసంతృప్తి !

frame నాని పై రాజమౌళి అసంతృప్తి !

Seetha Sailaja

 

నిన్నటి రోజున జరిగిన ‘అ’ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. హీరో నానీకి ఎంతో సన్నిహితుడైన రాజమౌళి ఈ నేచురల్ స్టార్ పట్ల అసంతృప్తి వ్యక్త పరుస్తూ చేసిన కామెంట్స్ విని ఆ కార్యక్రమానికి వచ్చిన అతిధులు అంతా ఆశ్చర్యపోయారు.

 

RAJAMOULI ALONG WITH NANI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇక ఈ సంఘటన వివరాలలోకి వెళితే రాజమౌళి తన ఉపన్యాసంలో నాని ప్రస్తావన తీసుకు వస్తూ వరుస హిట్లతో దూసుకెళ్తున్న నాని సూపర్ ఫామ్ గురించి గొప్పగా మాట్లాడుతూనే నానికి చురకలు అంటించాడు. ఈమధ్య నాని నటించిన ఒక సినిమా బాగా హిట్ అయిందని చెపుతూ అది చూసిన తరువాత తాను నానికి పెట్టిన మెసేజ్ ని బయట పెట్టాడు. ‘వరస హిట్లు కొట్టడం కాదు నీనుంచి ఇంతకు మించి ఆశిస్తున్నా’ అంటూ నానీకి మెసేజ్ పెట్టిన విషయాన్ని బయటపెట్టాడు నాని.

 

అంతేకాదు ఇదే సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాలు రొటీన్ గా ఉంటున్నాయి అని అర్ధం వచ్చే రీతిలో కామెంట్ చేస్తూ నాని స్నేహితులు కానీ అతడి అభిమానులు కానీ ఇంతకన్నా మంచి పాత్రలను కోరుకుంటున్నారు అంటూ కామెంట్ చేసాడు. దీనితో ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది రాజమౌళి వ్యక్తిగతంగా ఈవిషయాలు నేచురల్ స్టార్ కు చెప్పకుండా ఇలా బహిరంగంగా ఎందుకు కామెంట్స్ చేసాడు అంటూ చాలామంది కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.

 

అంతేకాదు రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ నాని లేటెస్ట్ గా నటించిన ‘ఎంసిఎ’ ని దృష్టిలో పెట్టుకుని చేసి ఉంటాడు అని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి నాని నటిస్తున్న సినిమాలలో చెప్పుకోతగ్గ కథలు లేకపోయినా నానికి ప్రస్తుతం ప్రేక్షకులలో ఏర్పడిన క్రేజ్ రీత్యా నటించిన ప్రతి సినిమా బంగారంగా మారిపోతోంది. అయితే ఇలాంటి అదృష్టం ఎంత గొప్ప హీరోకి అయినా ఎక్కువ కాలం నిలబడదు అన్న ఉద్దేశ్యంతో రాజమౌళి నానీకి ఇలా ఓపెన్ గా చురకలు అంటించాడు అని అనుకోవాలి..   

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: