అమ్మను భయపెట్టిన సాయి ధరమ్ తేజ్ !

Seetha Sailaja
నిన్న విడుదలైన ‘జవాన్’ సినిమాను ప్రమోట్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వివరిస్తూ తన గురించి తన తల్లికి ఏర్పడ్డ భయాలను వివరించాడు. తాను అనుకోకుండా సినిమాలలోకి వచ్చాను అని అంటూ ఎంబీఏ చదువుకున్న తనను మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వమని తన తల్లి చెపితే తనకు ఉద్యోగాలు నచ్చక సినిమా రంగం వైపు వచ్చిన విషయాన్ని వివరించాడు.

ఒకసారి తన తల్లి బలవంతం పై రెండురోజులు ఒక ఉద్యోగంలో చేరిన తనకు ఆ ఉద్యోగం సరిపడక బెంగతో ఫీవర్ వచ్చి తన రూమ్ నుండి బయటకు రాని విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అప్పట్లో తన పరిస్థితి చూసి తాను డ్రగ్స్ తీసుకున్నానా ? మందు కొడుతున్నానా ? సిగరెట్ తాగుతున్నానా అన్న భయాలతో తన తల్లి భయపడి తన వద్ద నుండి ఎటువంటి చెడు అలవాట్ల జోలికి వెళ్ళను అని మాట తీసుకున్న సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 
  
ఇదే సందర్భంలో తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి మాట్లాడుతూ బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా అని సినిమాలను ప్రేక్షకులు చూడరని టాలెంట్ ఉంటేనే ఆదరిస్తారని కామెంట్ చేసాడు తేజ్. దేశం మొత్తం మీద సినిమా రంగంలో వందల కొద్ది హీరోలు ఉంటారని కనీసం వారిలో ఒకరిగా అయినా గుర్తింపు పొందాలని తాను సినిమా రంగంలోకి వచ్చిన విషయాన్ని బయట పెట్టాడు ఈ మెగా మేనల్లుడు. 

ఇదే సందర్భంలో సాయి ధరమ్ తేజ్ ని ఆమధ్య ఒక ఎంపీ సినిమా ఇండస్ట్రీపై దారుణమైన కామెంట్స్ చేసిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు తేజు చాల విలక్షణంగా స్పందించాడు. ‘ఐ ఫీల్ సో హ్యాపీ. మా ఇండస్ట్రీ గురించి, మా పీపుల్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడుతున్నారుగా’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి తమ్మారెడ్డి స్పందిస్తూ ‘చీ దుర్మార్గుడా, దుష్టుడా అని నవ్వుతూ మీ లాంటి వారు ఉన్న ఇండస్ట్రీ నుండి నేను విరమిస్తున్నా’ అంటూ జోక్ చేయడంతో తేజులోని కామెడీ యాంగిల్ ను బయట పెడుతోంది. నిన్న విడుదలైన ‘జవాన్’ కు రివ్యూలు బాగానే వస్తున్నా కలక్షన్స్ పరంగా ఈసినిమా చెప్పుకోతగ్గ స్థాయిలో నిలబడుతుందా అన్న అనుమానాలు ఇండస్ట్రీ వర్గాలు వ్యక్త పరుస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: