టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ మధ్య ఇప్పుడు గట్టిపోటీ నడుస్తున్న నేపధ్యంలో టాప్ హీరోయిన్స్ నటించే రెండుసినిమాలు ఫెయిల్ అయితే చాలు వారిపై ఐరన్ లెగ్ ముద్ర వేస్తూ వారి పని అయిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రకుల్ ప్ర్రేత్ కి ‘స్పైడర్’ ఫెయిల్యూర్ తో ఎదురుకావడంతో ఆమె కెరియర్ పరంగా చాలా సతమతమవుతోంది.
దీనితో ఈరోజు రిలీజ్ కాబోతోన్న ‘ఖాకి’ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. దీనితో ఈసినిమాకి ప్రమోషన్స్ పై చాలా శ్రద్ధ పెడుతోంది రకుల్. దీనికోసం సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన రకుల్ పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.
పవన్ తో సినిమాను ఎప్పుడు చేయబోతున్నారు అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ "నాకూ చేయాలనే ఉంది. ఓ పని చేయండి. మీరే వెళ్ళి ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ గారినే అడగండి" అంటూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఆఫర్ కోసం వ్యూహాత్మకంగా ప్రమోట్ చేసుకుంటోంది. దీనితో షాక్ అయిన పవన్ అభిమానులు రకుల్ ప్రీత్ సింగ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఓకే కానీ ఈమె గురించి అడిగితే పవన్ ని ఆన్సర్ అఢగమని చెప్పడం మాత్రం మరీ టూమచ్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ ‘ఖాకి’ సినిమాలో తనపాత్ర క్యూట్ గా ఉంటుంది అనిఅంటూ ఈసినిమా కథ నిజజీవిత ఆధారంగా ఉండటంతో అందరికీ నచ్చుతుంది అని చెపుతోంది. తాను పంజాబీ అమ్మాయిని అయినా తనకు తెలుగు అంటే ఎంతోఇష్టం అని అంటూ తాను ఎప్పటకి టాలీవుడ్ ను విడిచి వెళ్ళను అని చెపుతోంది. ఏదిఏమైనా ఈరోజు విడుదల అవుతున్న ‘ఖాకి’ కుడా సక్సస్స్ సాధించకపోతే రకుల్ కెరియర్ మరింత కష్టాలలో పడే అవకాశాలు చాలస్పష్టంగా కనిపిస్తున్నాయి..