హీరో కారు ధ్వంసం అయ్యింది..ఎందుకో తెలుసా..!

Edari Rama Krishna
దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘చత్రపతి’.  ఈ చిత్రంలో ప్రభాస్  చిన్ననాటి పాత్ర వేసిన నటుడు మనోజ్ నందన్ గుర్తుంది కాదా..తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు.  తాజాగా హైదరాబాద్ సిటీలో గతరాత్రి కురిసిన భారీ వర్షానికి టాలీవుడ్ నటుడు మనోజ్‌ నందం కారు ధ్వంసమైంది.

సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి గచ్చిబౌలిలోని బీఎస్ఎన్ఎల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్ వద్ద ప్రహరీ గోడ కూలిపోయింది.  ఇదే సమయంలో తన ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వస్తున్న నటుడు మనోజ్ నందం కారుపై కూడా పెద్ద బండరాళ్లు పడడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఐతే, పెద్దప్రమాదం తప్పిందంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు మనోజ్ నందం.

అదే గోడపక్కన పార్కింగ్ చేసిన రెండు కార్లపై ఈ గోడ శిథిలాలు పడడంతో అవి కూడా ధ్వంసమయ్యాయి.  ఆ సమయంలో గోడ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఇటుకలు, బండరాళ్లు పడడంతో ఆమె ఆమె సృహ కోల్పోయింది. 

వెంటనే ఆమెను  స్థానికులు ఆసుపత్రికి తరలించారు.  కాగా, గత కొన్ని రోజులు నుంచి నగరంలో విపరీతంగా వర్షాలు కురుస్తుండటంతో..నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  మొత్తానికి  పెద్దప్రమాదం తప్పిందంటూ మనోజ్ నందం కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: