తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య హీరోలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మద్య జై లవ కుశ చిత్రంలో ఎన్టీఆర్ జై పాత్రలో నత్తి మాట్లాడుతూ..అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా మాస్ మహరాజ అంధుడిగా రవితేజ నటిస్తోన్న ‘రాజా ది గ్రేట్’ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. శ్రీవెంకటేశ్వర పతాకంపై ‘దిల్’రాజు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు.
మెహరీన్ కౌర్ హీరోయిన్. దీపావళి కానుకగా అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రం 'రాజా ది గ్రేట్'.కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్నీ సమపాళ్లలో ఈ చిత్రంలో ఉన్నాయనేది ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.
ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్ ‘లైఫ్ ఏదీ ఎదురొచ్చి మనకివ్వదు... బాధ నుంచి సంతోషమైనా, ఓటమి నుంచి గెలుపైనా’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్, ‘నేను పూరీలు వేసుకోవడం లేదురా, ఉరేసుకుంటున్నాను!’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అనడం, ‘చివరగా వచ్చే ఆర్తనాదం వినాలని ఉంది’ అంటూ రవితేజ బదులివ్వడం ఆసక్తికరంగా ఉన్నాయి.
‘ప్రేక్షకుల ముఖచిత్రాలేమిటో..!’ అనే డైలాగ్ ట్రైలర్లో హైలెట్గా నిలిచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. సుమారు రెండు సంవత్సరాల తరువాత రవితేజ నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. రవితేజ తల్లి పాత్రను సీనియర్ నటి రాధిక పోషించారు.
Here is the Trailer of my World #RajaTheGreat!#RajaTheGreatTrailer #WelcomeToMyWorldhttps://t.co/r9MhpSfrHE— Ravi Teja (@RaviTeja_offl) October 6, 2017