మెగాస్టార్ అనగానే మన తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది చిరంజీవి పేరు మాత్రమే. అయితే ఇదే పదంతో హిందీ ప్రేక్షకులు అమితాబ్ ను తమిళ ప్రేక్షకులు రజనీకాంత్ ను చాలా అభిమానంగా పిల్చుకుంటూ ఉన్నా మన తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నాటుకుపోయిన పేరు చిరంజీవి మాత్రమే. ఇలాంటి మెగా స్టార్ బిరుదును అనుకోకుండా ఒక ప్రముఖ ఆన్ లైన్ మూవీ టిక్కెటింగ్ సంస్థ తమ మూవీ టికెట్స్ ను ప్రమోట్ చేస్తూ బన్నీకి ఈ మెగా స్టార్ పదాన్ని వాడటం వివాదంగా మారింది.
‘మెగా స్టార్ అల్లు అర్జున్ ఈజ్ బ్యాక్’ అని బన్నీ ‘దువ్వాడ జగన్నాథమ్’ ను ప్రమోట్ చేస్తూ ఈ ఆన్ లైన్ టిక్కెట్ సంస్థ వాడిన పదాలు మెగా అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలు అన్నీ మెగా కుటుంబ దృష్టికి కూడ వెళ్ళినట్లు టాక్.
అయితే ఈ వ్యవహారం అంతా అల్లు అర్జున్ ప్రేమేయం లేకుండా జరిగినా కోపాన్ని మాత్రం చిరంజీవి అభిమానులు అల్లు అర్జున్ పై చూపెడుతున్నారు. ఇప్పటికే ‘దువ్వాడ జగన్నాథమ్’ కు డివైడ్ టాక్ వచ్చినా అదృష్టం కొద్ది ఎటువంటి పెద్ద సినిమాలు పోటీ లేకపోవడంతో అల్లుఅర్జున్ అనుకోకుండా గట్టేక్కాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ మెగా స్టార్ ఈజ్ బ్యాక్ రగడ వెంటనే ‘దువ్వాడ జగన్నాథమ్’ పై ప్రభావం చూపెట్టలేకపోయినా రానున్న రోజులలో బన్నీ సినిమాలకు సంబంధించి ఈ రగడ చాల ప్రభావం చూపించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ పేరు వింటేనే పవన్ అభిమానులు మండిపడుతున్న నేపధ్యంలో ఈ వ్యవహారంతో చిరంజీవి అభిమానులు కూడ బన్నీకి వ్యతిరేకంగా మారితే రాబోతున్నది బన్నీది కష్టకాలమా అన్న గాసిప్పులు వినపడుతున్నాయి..