దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో తెరకెక్కిన 'శతమానం భవతి' చిత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల లిస్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఈ మూవీకి జాతీయ అవార్డు వచ్చింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఈ సినిమా యూనిట్ ను అభినందించేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అతిథిగా వచ్చిన అల్లుఅర్జున్ ఈమూవీని ‘బాహుబలి’ తో సమానం చేస్తూ చేసిన కామెంట్స్ ఆకార్యక్రమానికి వచ్చిన చాలా మందిని ఆశ్చర్య పరిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రంలో పాల్గొన్న అల్లుఅర్జున్ దిల్ రాజుతో తనకున్న సాన్నిహిత్యం గురించి మాట్లుడుతూ తమ ఇద్దిరి మధ్య ఉన్న క్లోజ్ అసోసియేషన్ గుర్తుకు చేసుకున్నాడు.
తాము ఇద్దరం ఒకేసారి తమ కెరీర్ మొదలు పెట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ దిల్ రాజ్ ‘దిల్’ సినిమా తన ‘గంగోత్రి’ ఒకేసారి రిలీజ్ అయిన విషయాన్ని మరోసారి గుర్తుకు చేసుకున్నాడు. తమ ఇద్దరి రెండో చిత్రం ‘ఆర్య’ నుండి తమ ప్రయాణం మొదలు పెట్టి ఈనాటికి దిల్ రాజ్ తీస్తున్న 25వ సినిమా చేస్తున్నాను అని అంటూ దిల్ రాజ్ తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు చేసుకున్నాడు.
ఇదే సందర్భంలో మరింత మాట్లుడుతూ బన్ని తెలుగులో మూడే సినిమాలకు ఇలాంటి అవార్డ్స్ వచ్చాయి అంటూ ‘శంకరాభరణం’, ‘గీతాంజలి’ ఇపుడు మూడో మూవీ ‘శతమానం భవతి' అంటూ మన తెలుగు సినిమాకు రేర్ గా వచ్చే అవకాశం ఇది కామెంట్ చేసాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ అనుకోకుండా అల్లు అర్జున్ చేసిన వింత వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్య పరిచాయి.
బాహుబలి సినిమా మనల్ని నేషనల్ స్థాయిలోనిలపెడితే ‘శతమానం భవతి’ కూడా తెలుగు సినిమాకు నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసింది అంటూ మితిమీరిన ఉత్సాహం తో బన్ని నోటివెంట ఈ కామెంట్స్ విన్న మీడియా వర్గాలు అల్లుఅర్జున్ దిల్ రాజ్ ను ‘బాహుబలి’ తో సమానం చేసాడు అంటూ సెటైర్లు వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి..