మెగా డిస్ప్యూట్ పై వరుణ్ తేజ్ సంచలన కామెంట్స్ !

Seetha Sailaja
రేపు విడుదల కాబోతున్న ‘మిస్టర్’ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. దీనికోసం ఈసినిమాను చాల గట్టిగా ప్రమోట్ చేస్తూ చాల ఛానల్స్ కు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ హడావిడి చేస్తున్నారు ఈ మెగా యంగ్ హీరో. 

ఈ ప్రమోషన్ లో భాగంగా మెగా బ్రదర్స్ సాన్నిహిత్యం పై వరుణ్ తేజ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  చిరంజీవి-పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలకు సంబంధించి తరుచు మీడియాలో వార్తలు రావడం సాధారణంగా మారిపోయిందని వారిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా వీటికి ఫుల్ స్టాప్ పడకపోవడం వెనుక కారణం ఏమిటో తనకు అర్ధం కాదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు వరుణ్ తేజ్.

అంతేకాదు ఇలాంటి వార్తలు విన్నప్పుడు తనకు చాలా బాధ కలుగుతుందని  మెగా కుటంబ సభ్యుడిగా ఇలాంటి వార్తలు ప్రారంభంలో తనను చాలా బాధపెట్టిన సందర్భాలను గుర్తుకు చేసుకున్నాడు వరుణ్ తేజ్. ఇదే సందర్భంలో మరో ట్విస్ట్ ఇచ్చాడు వరుణ్ తేజ్. మెగా కుటుంబ సభ్యుడుగా అసలు నిజాలు ఏమిటి అన్నది తనకు తెలుసు అనీ వాస్తవాలు తెలియకుండా తమ ఫ్యామిలీ గురించి కామెంట్లు వ్రాసే బయటవారికి అసలు విషయాలు ఏమి తెలుసు అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు వరుణ్ తేజ్.

అంతేకాదు పవన్ చిరంజీవిల మధ్య రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా ఫ్యామిలీ పరంగా వారిద్దరూ ఒక్కటే అన్న క్లారిటీలు పదేపదే ఇవ్వడం తనకు చాల అసౌకర్యంగా ఉంది అంటూ ఆ సక్తికర కామెంట్స్ చేసాడు వరుణ్ తేజ్. అయితే ఇప్పటి వరకు ఏ మెగా యంగ్ హీరో టచ్ చేయని మెగా బ్రదర్స్ సాన్నిహిత్యం పై ఇప్పుడు ప్రత్యేకంగా వరుణ్ తేజ్ తన సినిమా ప్రమోషన్ తో పాటు హైలెట్ చేస్తూ ఎందుకు కామెంట్ చేసారు అన్నది సమాధానం లేని ప్రశ్న..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: