యంగ్ టైగర్ ఎన్టీఆర్ కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డ్ ప్రధానోత్సవం జరిగింది. జీ తెలుగు సినిమా అవార్డుల్లో అత్యంత క్రేజీ హీరోగా 2016 సంవత్సరానికి గాను అత్యధిక కలక్షన్స్ రాబట్టిన సినిమా హీరో విభాగంలో జూనియర్ ఎన్.టి.ఆర్ కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డ్ అందుకున్నాడు. కొద్దికాలంగా ఫ్యాన్స్ కోరుకుంటున్న సినిమాలను ఇవ్వడంలో తడబడ్డ తారక్ టెంపర్ తో కొత్త రూట్ ఎంచుకున్నాడు.
లాస్ట్ ఇయర్ వచ్చిన నాన్నకు ప్రేమతో కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకోకపోయినా కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో మరోసారి తన సత్తా చాటాడు యంగ్ టైగర్. ఈ సక్సెస్ కు కారణమైన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు ఎన్.టి.ఆర్.
ఇంకా ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసే డిఫరెంట్ పాత్రలను తాను చేస్తానని అన్నారు. ప్రస్తుతం తారక్ బాబి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. జై లవ కుశ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కూడా కచ్చితంగా ఫ్యాన్స్ అంచనాలను మించి ఉంటుందని తెలుస్తుంది. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా సెట్స్ లో ఎన్.టి.ఆర్ ఈమధ్యనే ఎంట్రీ ఇచ్చాడు.
జీ తెలుగు నిర్వహించిన ఈ టాప్ హీరో కేటగిరిలో కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ గా తారక్ గెలుచుకున్న అవార్డ్ మిగతా స్టార్ హీరోలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నూనుగు మీసాల టైంలోనే బాక్సాఫీస్ బాద్షాగా నిలిచిన ఎన్.టి.ఆర్ మళ్లీ తిరిగి తన హిట్ ట్రాక్ ఎక్కేశాడు. మరి ఇదే స్టామినా కంటిన్యూ చేస్తే మిగతా వారికి చెక్ పెట్టేసినట్టే.