ఓంకార్ సినిమా షూటింగ్ లో నాగార్జున నైరాశ్యం!

Seetha Sailaja
‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా ఘోర పరాజయం తరువాత నాగార్జున నటిస్తున్న ‘రాజుగారి గది 2’ రెగ్యులర్ షూటింగ్ వేగం అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా అఖిల్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అవడంతో షాక్ అయిన నాగార్జున ఆ షాక్ నుండి తేరుకుని గత రెండు రోజులుగా ఈసినిమా షూటింగ్ కు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో నాగార్జున దెయ్యంతో ఆటలు ఆడుకునే ఒక మానసిక డాక్టర్ ను పోలిన క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈసినిమా కోసం నాగార్జున ఒక డిఫరెంట్ లుక్ ను కూడ ఏర్పరుచుకున్నాడు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ‘రాజుగారి గది 2’ షూటింగ్ స్పాట్ లో నాగ్ తన మనస్తత్వానికి భిన్నంగా చాల ముభావంగా కనిపించాడని ఆ షూటింగ్ ను దగ్గర నుండి పరిశీలించిన వారు అంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ వార్తలు మటుకు హాట్ న్యూస్ గా మారాయి.

అంతేకాదు ఎప్పుడూ నవ్వుతు సహనటులతో సరదాగా ఉండే నాగార్జున ఈ మూవీ షూటింగ్ స్పాట్ లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా తన పాత్రకు సంబంధించిన డైలాగ్ పోర్షన్ ను నటించి వెంటనే తన వ్యాన్ లోకి వెళ్ళి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మళ్ళీ షాట్ రెడీ అయిన తరువాత మాత్రమే నాగ్ తన వ్యాన్ నుండి బయటకు వచ్చి తన రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లి పోతున్నట్లు టాక్.

అయితే ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో విశ్లేషకులు మరో విధంగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో పెళ్ళిళ్ళు బ్రేకప్ లు అతి సాధారణమైన వార్తలుగా మారిపోతున్న నేపధ్యంలో నాగార్జున అఖిల్ ఎంగేజ్ మెంట్ బ్రేకప్ వ్యవహారాన్ని ఎందుకు ఇంత సున్నితంగా తీసుకుంటున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి రూమర్స్ పై వెంటనే చెక్ పెట్టకపోతే ఈ రూమర్స్ రకరకాల వార్తలుగా మారిపోయి ఎంతో భవిష్యత్ ఉన్న అఖిల్ కెరియర్ ను దెబ్బతీస్తాయి కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఏ విషయం పై అయినా ఆచితూచి స్పందించడమే కాకుండా ఎటువంటి ఉద్వేగానికి లోను కాకుండా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించే నాగార్జున ప్రస్తుతం అఖిల్ పై వస్తున్న రూమర్స్ విషయంలో ఎప్పుడు మౌనం వీడుతాడు అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ సీరియల్ లా కొనసాగుతూనే ఉంది..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: