మెగా కుటుంబం కోసం సుమ పాట అనసూయ ఆట !

Seetha Sailaja
గత దశాబ్ద కాలంగా బుల్లితెరను తన మాటలతో శాసిస్తున్న సుమ హవా ఎంతమంది యంగ్ యాంకర్లు వచ్చినా తగ్గడం లేదు. దీనికి కారణం తెలుగు భాష పై ఆమెకు ఉన్న పట్టు. దీనికిమించిన ఆమె సమయస్పూర్తి. అటువంటి సుమ ఇప్పుడు సింగర్ గా మారడం ఇప్పుడు సంచలనంగా మారింది. 

అయితే సుమ తన గొంతుతో పాట పాడుతున్నది ఒక ఐటమ్ సాంగ్ కోసం. ఆ ఐటమ్ సాంగ్ లో హాట్ యాంకర్ అనసూయ నటిస్తోంది. సుమచేత పట్టుపట్టి ఈ పాటను పాడించింది ప్రముఖ సంగీత దర్శకుడు తమన్.  మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న గోపీచంద్ మలినేని ‘విన్నర్’ సినిమా కోసం సుమ ఈపాట పాడింది. 

స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ లో నిర్మిస్తున్న ఈ మూవీ కోసం సుమ పాడిన పాటను నిన్న విడుదల చేసారు. పక్కా మాస్ సాంగ్ లో అనసూయ డాన్స్ చేస్తూ ఉంటే ఆమెతో కలిపి సాయి ధరమ్ తేజ్ స్టెప్స్ వేస్తూ ఉన్న ఈపాట మెగా అభిమానులను బాగా అలరిస్తుంది. త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు చేసిన పోరాటమే ఈసినిమా కథ అని అంటున్నారు. 

ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ 25 కోట్ల కలక్షన్స్ హీరోగా మారిన నేపధ్యంలో తన తదుపరి లక్ష్యం 30 కోట్ల కోసం ఈ ‘విన్నర్’ ద్వారా ప్రయత్నిస్తున్నాడు.  ఈ లక్ష్యానికి సుమ పాట అనసూయ ఆట ఎంత వరకు సహకరిస్తుందో చూడాలి. మార్చి నెలలో విడుదల కాబోతున్న ఈసినిమా పై చాల ఆశలు పెట్టుకున్నాడు ఈ మెగా హీరో..     



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: