పవన్ బన్నీల అభిమానుల మధ్య మళ్ళీ రగిలిన ట్విటర్ వార్ ?

Seetha Sailaja
‘చెప్పను బ్రదర్’ కామెంట్స్ తో ప్రారంభం అయిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మాటల వార్ ఈమధ్య కాలంలో కొంత వరకు సద్దుమణిగింది. అయితే అనుకోకుండా దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్విట్ తో ఈమాటల వార్ మళ్ళీ మొదలు అవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

‘కాటమరాయుడు’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఏమాత్రం పాజిటివ్ టాక్ లేని ఈ మూవీ టీజర్ కు చిరంజీవి ‘ఖైదీ’ రికార్డులను బ్రేక్ చేసే విధంగా వచ్చిన హిట్స్ అదేవిధంగా లైక్స్ ఏకంగా మెగా కాంపౌండ్ నే ఆశ్చర్య పరిచాయి. దీనితో ఆత్మరక్షణలో పడ్డ మెగా కాంపౌండ్ వెంటనే స్పందించడమే కాకుండా రామ్ చరణ్ తన బాబాయ్ ని అభినందిస్తూ ట్విట్ కూడ చేసి తామంతా ఒకటే అన్న సంకేతాలు మెగా అభిమానులకు తెలియచేశాడు. 

దీనికి కొనసాగింపుగా సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లు కూడ ‘కాటమరాయుడు’ టీజర్ ను చూసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అయితే అల్లు అర్జున్ అదేవిధంగా అల్లు శిరీష్ లు మాత్రం ఈ ‘కాటమరాయుడు’ టీజర్ పై ఇప్పటి వరకు స్పందించకపోవడం పవన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహన్ని తెప్పిస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. 

ఈ పరిస్థుతులు ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమాను తీస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ ఒక ట్విట్ చేస్తూ ‘దువ్వాడ జగన్నాథం’ మూవీ టీజర్ అదేవిధంగా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.  ఈ ట్విట్ కు పవన్ వీరాభిమానులలోని కొందరు స్పందిస్తూ తాము ఈసినిమాను చూడము అని రీ ట్విట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈ వార్తలే నిజం అయితే మళ్ళీ పవన్ బన్నీల అభిమానుల మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది అనుకోవాలి. ఈ ఏడాది సమ్మర్ రేస్ కు రాబోతున్న ఈ రెండు సినిమాలు ఇంకా విడుదల కాకుండానే కేవలం టీజర్ విషయంలోనే అభిప్రాయభేదాలు ఏర్పడుతున్నాయి అంటే పవన్ బన్నీ అభిమానుల మధ్య రోజురోజుకి దూరం ఎంత పెరిగిపోతోందో అర్ధం అవుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: