ఈరోజు దేశం అంతా 68వ గణతంత్ర వేడుకలను చేసుకుంటూ మన దేశభక్తిని చాటుకుంటూ ఉంటె ఈరోజు జరగబోతున్న మన రిపబ్లిక్ డే పెరేడ్ మన సైనిక శక్తియుక్తులను ప్రపంచానికి చాటుతున్నాయి. ఈ సందర్భంగా మన దేశంలో ప్రతి గల్లీలోను మన జాతీయపతాకం రేపరేపలాడటం సర్వ సాధారణ విషయం.
అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్ ఇండియా జాతీయ జెండాలోని త్రివర్ణాలతో మెరిసిపోతోంది. భారతదేశ 68వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నేడు, రేపు దుబాయ్ లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుర్జ్ ఖలీఫా టవర్ ను మన జాతీయ జెండాలోని మూడు రంగుల వెలుగులతో ముస్తాబు చేశారు. కాగా, ఓడ్ మెతాలోని ఇండియన్ హైస్కూల్ తో పాటు భారత రాయబార కార్యాలయంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
ఇది ఇలా ఉండగా ఈరోజు జరగబోతున్న గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజ్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్-నవ్యాన్ రావడం పలు కీలక ఒప్పందాల పై సంతకాలు జరగడంతో మన భారతదేశానికి గల్ఫ్ తో కొత్త బంధం ఏర్పడి ఎడారిలో ఒయాసిస్సుగా మారింది. ఇది ఇలా ఉండగా గణతంత్ర దినోత్సవం అంటే టాలీవుడ్ కోలీవుడ్ సినిమా రంగాల ప్రముఖులకు ‘పద్మ’ అవార్డులు రాకుండా గడిచిన సందర్భాలు లేవు.
అయితే అనూహ్యంగా ఒక్కరంటే ఒక్కరికి కూడ టాలీవుడ్ కోలీవుడ్ సినిమా రంగాలకు సంబంధించి మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా రంగానికి సంబంధించిన ఏ ప్రముఖ నటుడుకి అదేవిధంగా నటికి ‘పద్మ’ అవార్డులు రాకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే తెలుగు సినీ సంగీతాభిమానులకు సుపరిచితుడైన ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాస్ 'పద్మ' పురస్కారాల లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం కొంత వరకు ఈ అసంతృప్తిని తగ్గిస్తోంది. ఏది ఏమైనా మన టాలీవుడ్ సినిమా రంగ ప్రముఖులకు సంబంధించి ఎందరో ఈ ‘పద్మ’ అవార్డులను ఆశిమ్చినా ఎవరికీ దక్కక పోవడం షాకింగ్ న్యూస్ గా మారింది..