సినిమా రంగానికి ఒక కోరికతో వచ్చిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమాల్లో దర్శకుడిగా రాణించాలనే తపనతో భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చిన త్రివిక్రమ్ తనను తాను నిరూపించుకోవడానికి మొదట్లో చాలా కష్టాలు పడ్డాడు. అయితే ఇప్పడూ అదే కష్టాలలో ఉన్నాడు.
త్రివిక్రమ్ కష్టాలకు కారణం ఖలేజా సినిమా. కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లు, ఖలేజా పరాజయానికి అనేక కారణాలు. అయితే సినిమా పరిశ్రమలో డైలాగ్ రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, దర్శకుడిగా ఒక్కొ ఇటుక పేర్చుకుంటూ నిర్మించుకున్న సౌధాన్ని ఖలేజా కూల్చిపారేసింది.
దీంతో ఇప్పుడు మళ్లీ తనను నిరూపించుకోవాల్సిన అవసరం త్రివిక్రమ్ కు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వ్యక్తుల కున్న ప్రతిభ కన్నా, వారు సాధించిన విజయాలకే ప్రాధాన్యత. ఖలేజా పరాజయం తరువాత త్రివిక్రమ్ ఎంతో కసిగా రూపొందించిన సినిమా జులాయి. జులాయి విషయంలో త్రివిక్రమ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అంతేకాకుండా తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రచారం కోసం ప్రత్యేకంగా ఒక పాటనే రూపొందించారు.
ఇన్ని జాగ్రత్తలతో వస్తున్న జులాయి హిట్ అవుతుందా.. త్రివిక్రమ్ తాను అనుకున్నది సాధిస్తాడా..! మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే..!!
మరింత సమాచారం తెలుసుకోండి: