చైతూ సమంతల పెళ్ళి కబురు గురించి తహతహలాడుతున్ననాగార్జున అభిమానులకి ఒక షాకింగ్ న్యూస్ ఈ రోజు ఫిలింనగర్ హడావిడిచేస్తోంది. క్రిస్మస్ తరువాత రాబోతున్న నూతన సంవత్సరం మొదట్లో తమ పెళ్ళి జరగాలని కోరుకుంటున్న సమంత అభిప్రాయానికి నాగచైతన్య బ్రేక్ వేసాడు అన్న వార్తలు వస్తున్నాయి.
ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఒకవైపు సమంత నాగార్జున తమ పెళ్ళి డేట్ ను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తాడా అని ఎదురు చూస్తున్న నేపధ్యంలో చైతూ సమంతకు ఇచ్చిన షాక్ ఊహించని విధంగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. సమంత చైతూల పెళ్ళికి ఒక మంచి ముహూర్తం కోసం నాగార్జున జ్యుతిష్కుల సలహాలు అడుగుతూ ఉంటే చైతూ మాత్రం తన పెళ్ళి డేట్ ను వచ్చే ఏడాది సమ్మర్ వరకు వాయిదా వేయమని తన తండ్రి నాగార్జునను కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇలా చైతన్య ప్రవర్తించడానికి ఒక ఆ శక్తికర కారణం ఉంది అని అంటున్నారు. నాగచైతన్య నటిస్తున్న ‘ప్రేమమ్’ ఈ దసరా రేసుకు రాబోతోంది. దాని తరువాత ఒక్క నెల గ్యాప్ లో చైతూ ‘సాహసమే శ్వాసగా సాగిపో’ నవంబర్ లో విడుదల కాబోతోంది.
ఈ రెండు సినిమాలకు నాగచైతన్య చాల ఉత్సాహంగా ప్రమోట్ చేసిన తరువాత నవంబర్ నెలాఖరు నుండి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించబోయే సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా మార్చి లోపు పూర్తి చేసి ఈసినిమాను సమ్మర్ రేస్ కు తీసుకు రావాలని నాగచైతన్య చాల గట్టి పట్టుదల మీద ఉన్నట్లు టాక్.
దీనితో కళ్యాణ కృష్ణ సినిమా హడావిడి మధ్య తన పెళ్ళి హడావిడి కలిస్తే ఆ మూవీ ప్రాజెక్ట్ పట్ల తాను పూర్తి శ్రద్ధ పెట్టలేననే ఆలోచన చైతన్యకు రావడంతో సమంతతో జరగబోయే తన పెళ్లిని సమ్మర్ కు చైతూ వాయిదా వేసినట్లు టాక్. ఈ అభిప్రాయం సమంతకు కూడ తెలియచేయడంతో సమంత కొంత వరకు షాక్ అయింది అని తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 20వ తారీఖున చైతన్య ‘ప్రేమమ్’ ఆడియో ఫంక్షన్ జరగబోతున్న నేపధ్యంలో ఈ ఫంక్షన్ కు సమంత వస్తుందా ? అన్న ఆ శక్తి చాల మందిలో ఉంది. అయితే కళ్యాణ్ కృష్ణ సినిమా తరువాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగచైతన్య మరో సినిమా చేయబోతున్న నేపధ్యంలో మరి ఈ సినిమా కూడ పూర్తి అయ్యేదాక చైతన్య సమంతతో పెళ్ళి మళ్ళీ వాయిదా వేస్తే పరిస్థితి ఏమిటి అన్నదే ప్రశ్న..