మెగా అభిమానుల నెపోలియన్ డ్రీమ్ !

Seetha Sailaja
చిరంజీవి 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ అని ప్రచారం జరుగుతూ ఉంటే మధ్యలో చరణ్ వచ్చి ఇది ఫైనల్ టైటిల్ కాదు అంటూ లీకులు ఇచ్చాడు. ఆ తరువాత ఈ సినిమాకు మెగా కాంపౌండ్ ‘ఖైదీ 150’ అన్న టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

అయితే ఈ టైటిల్స్ ఏమి నచ్చక పోవడంతో ఇప్పుడు ఏకంగా మెగా అభిమానులు డైరెక్ట్ గా రంగంలోకి దిగి వారికి నచ్చిన టైటిల్ ను డిజైన్ చేసుకుని సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.  చిరంజీవి 150వ సినిమా పోస్టర్ అంటూ ‘నెపోలియన్’ పేరిట ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. అంతేకాదు ఈ పోస్టర్ డిజైన్ చేసిన అభిమానులు ఈ పోస్టర్ లో ‘పోరాటం అతని నైజం’ అనే ఉపశీర్షిక కూడ తగిలించారు. 

పోస్టర్ బ్యాక్‌ గ్రౌండ్‌లో పొలం దున్నుతున్న రైతు ఫొటోను, చిరంజీవి ఫొటోను ఇచ్చి చిరంజీవి అంతర్లీనంగా రైతు ఆత్మహత్యలు, ల్యాండ్ మాఫియా వంటి అంశాలకు సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్‌లను కూడ ఆ పోస్టర్ లో పెట్టారు. ఇదిలాఉంటే  టాలీవుడ్ లో కొత్త డైరెక్టర్ ఆనంద్ రవి ‘నెపోలియన్’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేసిన నేపధ్యంలో ఇప్పుడు ఈ టైటిల్ పై మెగా అభిమానుల కన్ను పడిందా ? లేదంటే ఏకంగా మెగా కాంపౌండ్ దృష్టి దీని పై పడిందా అనే విషయమై రకరకాల ఊహలు హడావిడి చేస్తున్నాయి. 

మరి కొందరైతే రామ్ చరణ్ వ్యూహాత్మకంగా ఈ పోస్టర్ ను కొంత మంది మెగా అభిమానుల చేత సోషల్ మీడియాలో పెట్టించి జనం స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ప్రయోగం చేయించాడు అనే గాసిప్పులు కూడ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నెపోలియన్ హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: