సమంతకు షాక్ – చైతూ రకుల్ కళ్యాణం !

Seetha Sailaja
ఒకవైపు తాను ఇంకా సినిమాలలో నటిస్తాను అంటూ సమంత సంకేతాలు ఇస్తూ ఉంటే అదేమీ పట్టించుకోకుండా నాగార్జున సమంతకు ఒక గట్టి షాక్ ఇచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో నాగార్జున కళ్యాణ కృష్ణ దర్శకత్వoలో నాగచైతన్య హీరోగా నటించబోతున్న ‘కళ్యాణం’ మూవీలో చైతన్యతో పాటు సమంత హీరోయిన్ అని ఇప్పటి వరకు అనుకున్నారు.

అయితే ఇప్పడు సీన్ మారింది చైతూ, సమంత రిలేషన్ షిప్ గురించి రోజుకో వార్త వస్తూ ఉండంతో సమంతను తప్పించి ఆమె స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు అని ఫిలింనగర్ టాక్. ‘కళ్యాణం’ మూవీలో చైతూతో రొమాన్స్ చేయడానికి రకుల్ ప్రీత్ కూడ ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సమంత తన మూవీల జోరు తగ్గించుకుని ఇప్పటినుంచే అక్కినేని వారి కుటుంబ కోడలుగా మారడానికి ఈనిర్ణయం తీసుకున్నారా ? లేదా దీని  వెనుక మరి ఏమైనా వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా అన్నకోణంలో ప్రస్తుతం ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ధనుష్ హీరోగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘వాడా చెన్నై’ నుంచి సమంత తప్పుకుని కొన్ని రోజులు  కూడా కాకుండానే ఏకంగా  నాగచైతన్య పక్కన ఈమెను తప్పిచడం షాకింగ్ గా మారింది. 

అయితే సమంత తన ట్విటర్ లో మాత్రం ‘జనతా గ్యారేజ్  మీచివరి చిత్రమటగా అని ఒక అభిమాని అడిగితే ‘అది కచ్చితంగా రూమరే. నాకు సుదీర్ఘ కాలం సినిమాల్లో కొనసాగాలని ఉంది, కొనసాగుతాను’ అని సమంత స్పష్టం చేసిన కొద్ది గంటలకే ఈన్యూస్ ఇలా రావడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇదే చిట్ చాట్ లో సమంత కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు జవాబిచ్చింది. రాజమౌళి, తమిళ దర్శకుడు బాల వీళ్లిద్దరి నుంచి ఒకేసారి ఆఫర్ వస్తే ఎవరి సినిమాల్లో నటిస్తావు అని అడిగి నప్పుడు ‘రాజమౌళి’ అంటూ ఠకీమని బదులిచ్చింది. దీనిని బట్టి చూస్తూ ఉంటే సమంతకు నటించాలి అనే కోరిక  ఉన్నా పరిస్థితులు అందుకు సహకరించడం లేదా అనే సందేహాలు రావడం సహజం.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: