దేశవ్యాప్తంగా వర్మ చిత్రం

Chowdary Sirisha
భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాదుల దాడి... నవంబరు 26 ముంబై దాడి. తాజ్ హోటల్ మీద ముష్కరులు చేసిన ఆ దాడి దేశ ప్రజలందరినీ ఏకం చేసింది. అలాంటి సంఘటనను తన సినిమా కథగా ఎంచుకున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. దీనికి ది ఎటాక్స్ ఆఫ్ 26 బై 11 అని పేరు పెట్టాడు. మొదట దీన్ని తెలుగు, హిందీ, తమిళ భాషలలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ, ఈ కధాంశం దేశ ప్రజలందరికీ సంబంధించినది కావడంతో దీన్ని దేశమంతటా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అలా దేశంలోని 16 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు. అలా అన్నీ పూర్తయ్యాక మార్చి ఒకటో తేదీన దేశవ్యాప్తంగా విడుదల చేస్తారట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: