అకిరా కోసం ఎదురు చూస్తున్న మెగా క్రికెట్ టీమ్ !

Seetha Sailaja
ఆమధ్య వరుణ్ తేజ్ ఒక ఫిలిం ఫంక్షన్ లో మాట్లాడుతూ తమ కుటుంబం నుంచి వస్తున్న హీరోల సంఖ్య పెరిగి పోతూ ఉండటంతో తమ మెగా ఫ్యామిలీ క్రికెట్ టీమ్ సంఖ్యకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అప్పట్లో ఆ కామెంట్స్ విని చాలామంది నవ్వుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ అన్న మాటలు వాస్తవ రూపం దాల్చబోతున్నాయి. 

ఇప్పటి వరకు మెగా కుటుంబ హీరోల సంఖ్యను కౌంట్ చేస్తే 8 మంది లెక్కకు వస్తారు. ఇది చాలదు అన్నట్లుగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలో హీరోగా మారబోతున్న నేపధ్యంలో ఆ సంఖ్య 9కి చేరుకుంటుంది అనుకున్నారు అంతా. అయితే మరో ఊహించని  ట్విస్ట్ ఇస్తూ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ టాలీవుడ్ ఎంట్రీకి చిరంజీవి  లైన్ క్లియర్ చేసాడు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో 10కి చేరబోతోంది.

చిరంజీవి తన చిన్నల్లుడు కళ్యాణ్  ఉత్సాహాన్ని  గమనించి డాన్స్ లు ఫైట్స్ నేర్చుకోమని ఇప్పటికే సలహాలు ఇచ్చినట్లు వార్తల వస్తున్నాయి . అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు గా జరిగితే చిరంజీవి చిన్న అల్లుడి టాలీవుడ్ ఎంట్రీ వచ్చే సంవత్సరం ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు హడావిడి నిన్నటి నుంచి మీడియాలో ఫిలింనగర్ లో తెగ జరుగుతున్న నేపధ్యంలో మెగా  క్రికెట్  టీమ్ మ్యాజిక్ ఫిగర్ 11కు  చేరుకోవడానికి ఒకే ఒక్క హీరో మిగిలి ఉన్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి.

అంతేకాదు ఈ 11 వ ప్లేయర్ స్థానాన్ని ఫిలప్ చేయగల శక్తి పవన్ కొడుకు అకిరాకు మాత్రమే ఉందని ఇప్పటికే రేణు దేశాయ్ తీసిన సినిమాలో నటించిన అకిరా త్వరగా పెద్ద వాడు అయిపోతే వరుణ్ తేజ్ చెప్పిన మెగా క్రికెట్ టీమ్ రెడీ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ జోక్స్ పడుతున్నాయి. ఏమైనా మెగా కుటుంబం మహా వృక్షంలా విస్తరించి పోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: