సంపూర్ణేష్ ను బూతులు తిట్టిన ఎన్నారై!

Seetha Sailaja
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు  తనను ఒక ఎన్నారై బండబూతులు తిట్టాడు అంటూ ట్విట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.. 'ఇవాళ నా జీవితంలో చాలా గొప్ప రోజు. చాలా రోజుల తర్వాత ఆటా ఆర్గనైజర్ నోటి వెంట "అమ్మ అక్క లం..కొ.."బూతులు తిట్టించుకున్నాను.' అంటూ ట్వీట్ చేశాడు సంపూర్ణేష్.

ఈ బూతుల రగడ వల్ల తాను అమెరికాలో జరుగుతున్న ‘ఆటా’ ఈవెంట్ కు వెళ్ళడం లేదని ఆ ఎన్నారై తనను మాత్రమే కాకుండా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మరి కొంతమంది ఆర్టిస్టులను ఇదే విధంగా అవమాన పరిచాడని తెలుస్తోందని అంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు సంపూ. అంతేకాదు అమెరికాలో ఈవెంట్స్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్లు, తమను ముష్టి వారుగానో, బెగ్గర్లు గానో భావించద్దని ఘాటైన వ్యాఖ్యలు చేసాడు బర్నింగ్ స్టార్. 

సంపూర్ణేష్ చేసిన ఈ ట్వీట్స్ కు హాట్ యాంకర్ అనసూయా కూడ మద్దతు తెలిపింది. ఇలాంటి మధ్యవర్తుల వలన అసలు పార్టీల మధ్య వివాదాలు వస్తున్నాయని గగ్గోలు పెడుతోంది అనసూయ. అయితే ఇంత రగడ జరిగినా వచ్చే ఏడాది అమెరికాలో జరిగే ఈవెంట్స్ కు తాను వేళతానని అంటూ అమెరికాలోని తెలుగు వారికి సంకేతాలు ఇస్తున్నాడు సంపూ. 

‘హృదయ కాలేయం’, సినిమా ద్వారా ఓవర్సీస్ ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంపూ జూలై మొదటి వారంలో అమెరికాలో అత్యంత ఘనంగా జరగోతున్న ‘ఆటా’ రాజితోత్సవ వేడుకలలో పాల్గొని అక్కడ తన ఇమేజ్ మరింత పెంచుకుందాం అని ఆశిస్తున్న సంపూర్ణేష్ బాబు ఆశలను నిరుత్సాహ పరచడమే కాకుండా ఏకంగా ఆ ఎన్నారై బండబూతులు తిట్టడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఏది ఎలా ఉన్నా సంపూకు ఇది ఘోరమైన అవమానం అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: