
జవహర్ రెడ్డి : వైద్యుడే ప్రధాన కార్యదర్శయితే - పేదవాడికి నిండు నూరేళ్ళు!
ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంతో పాటు ఎలాంటి పథకాలను అమలు చేస్తే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందో ఆయనకు పూర్తిస్థాయిలో తెలుసనే సంగతి తెలిసిందే. జవహర్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి కాగా ఆయన ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ గా పని చేశారని తెలుస్తోంది. ఇన్నేళ్ల కెరీర్ లో వేర్వేరు బాధ్యతలను చేపట్టిన జవహర్ రెడ్డి ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు.
ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పని చేసిన ఆయన అమలు చేసిన సంస్కరణలు పేదల జీవితాలనే మార్చేశాయని తెలుస్తోంది. వైద్య నేపథ్యం ఉండటం వల్ల తుఫానులు, కరోనా సమయాలలో సైతం ఆయన సరైన నిర్ణయాలు తీసుకుని కష్టాల్లో ఉన్న ప్రజలకు సరైన న్యాయం చేసే విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
జవహర్ రెడ్డి ప్రధానంగా గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టి విద్య, వైద్యం లాంటి కనీస అవసరాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన వంతు కృషి చేశారని తెలుస్తోంది. జవహర్ రెడ్డి సేవలకు 1986 సంవత్సరంలో ఆయనను ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ తో సత్కరించారంటే ఆయన ప్రతిభ గురించి సులువుగా అర్థమవుతుంది. దూరదృష్టితో పేదవాడు నిండు నూరేళ్లు సంతోషంగా, ఆనందంగా జీవనం సాగించే విధంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే జవహర్ రెడ్డిని సీఎస్ గా మళ్లీ కొనసాగించే ఛాన్స్ అయితే ఉంది.