చంద్రబాబే - లోకేష్ శాఖకు ఏరి-కోరి తెచ్చుకున్న సమర్థుడీ రెడ్డి.. ఈయనకు ఎవరూ సాటిరారుగా!

Reddy P Rajasekhar
ఏపీలో పోలింగ్ కు ముందు పోలింగ్ తర్వాత ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. 2017 సంవత్సరంలో నారా లోకేశ్ ఐటీ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించగా చంద్రబాబే ఏరికోరి ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డికి లోకేశ్ శాఖలో పెద్దపీట వేసి కీలక బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబే - లోకేష్ శాఖకు ఏరికోరి జవహర్ రెడ్డిని తెచ్చుకున్నారంటే పరిపాలనలో ఈయన మార్క్ ఏపాటిదో అర్థమవుతుంది.
 
జవహర్ రెడ్డి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి చేయాలని ఆలోచించే అధికారిగా పేరు తెచ్చుకున్నారని తక్కువ సమయంలో ప్రజలకు వేగంగా మంచి జరగడంపై ఆయన దృష్టి పెట్టేవారని తెలుస్తోంది. ఈ కారణాల వల్లే జవహర్ రెడ్డి అంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సైతం ప్రత్యేకమైన అభిమానం అని సమాచారం అందుతోంది.
 
ప్రస్తుతం కొంతమంది కూటమి నేతలు జవహర్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నా ఆయన ఎంత నమ్మకంగా, నిజాయితీగా పని చేస్తారో వాళ్లకు తెలియనిది కాదు. ప్రజాసేవకు కట్టుబడి పని చేయడం, దూరదృష్టి నాయకత్వం సీఎస్ జవహర్ రెడ్డి ప్రత్యేకతలు అని చెప్పవచ్చు. పరిపాలనా పరంగా కఠినమైన సమస్యలు ఎదురైన సునిశిత దృష్టితో వాటిని పరిష్కరించడంలో జవహర్ రెడ్డికి ఎవరూ సాటిరారు.
 
జవహర్ రెడ్డి గురించి ఒక మాటలో చెప్పాలంటే ప్రజా పరిపాలనలో ఆయన అద్భుతతకు ప్రతీక అని చెప్పవచ్చు. ఏపీ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తులలో ఆయన కూడా ఒకరు కావడం గమనార్హం. జవహర్ రెడ్డి మాట సన్నితం అని మనస్సు మంచిదని ఆయనను దగ్గరినుంచి గమనించిన వాళ్లు చెబుతారు. ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పిన సమయానికి అందడంలో జవహర్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. ఏపీ బెస్ట్ సీఎస్ లలో జవహర్ రెడ్డి ఒకరని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: