దటీజ్ భానుమతి

Prasad
తెలుగు వారికి సుపరిచితమై వ్యక్తి శ్రీమతి భానుమతీ రామకృష్ణ . ఈవిడ బహుముఖ ప్రజ్ఝశాలి. నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, నిర్మతగా ఆవిడ రాణించారు. అలాగే రచనా రంగంలోనూ భానుమతి గొప్ప పేరు గడించారు. ఆవిడ రచించిన అత్తగారి కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. కాగా, ఒకసారి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు అవిడను కలిసి ’మేడమ్, మా సంఘం వారు ఈ సంవత్సరానికి మిమ్మల్ని ఉత్తమ నటిగా ఎంపిక చేశారు. కంగ్రాట్యులేషన్స్ ‘ అని చెప్పారు. దానికి భానుమతి గారు ఒక చిన్న నవ్వుతో తల పంకించి ’యూ హావ్ గుడ్ టేస్ట్ ‘ అని సమాధాన మిచ్చారు. దటీజ్ భానుమతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: