‘బాహుబలి’ తో నేషనల్ సెలిబ్రిటీగా మారిపోయిన రాజమౌళికి ఒక ప్రశ్న అంటే భయం. అందుకే ఆ ప్రశ్నను తప్పించుకోవడానికి రాజమౌళి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ ప్రశ్న మాత్రం దేశవ్యాప్తంగా సినీ అభిమానులను వేధిస్తున్న సమస్య. గత సంవత్సర కాలంగా ఆ ప్రశ్న మీద జరిగినన్ని చర్చలు మరెక్కడా జరుగలేదు.
దీనిపై వందల కొద్దీ జోకులూ సెటైర్లు పడ్డాయి ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే ‘కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు’ ? ఈప్రశ్నను ఈ సంవత్సర కాలంలో దర్శకుడు రాజమౌళినే డైరెక్ట్ గా కొన్ని వందలమంది అడిగారు. ‘బాహుబలి’ రెండవ భాగానికి సంబంధించిన కీలక మలుపు అదే కావడంతో రాజమౌళి ఆప్రశ్నఅవుట్ డేట్ కాకుండా చాలా జాగ్రత్త లు తీసుకుంటున్నాడు.
అయితే మొన్న గురువారం ఢిల్లీలో ‘సీఎన్ఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్న టైంలో అనేకమంది రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్న ఈసమావేసంలో ప్రముఖ సినిమా విమర్శకుడైన రాజీవ్ మసంద్ రాజమౌళి తన అవార్డ్ తీసుకోవటం అవగానే ఇదే ప్రశ్నను వేసి జక్కన్న ను ఇరుకున పెట్టాడు. ‘కట్టప్పానే బాహుబలి కో క్యోమ్ మారా, బస్ ఏ తో బతాయియే’ అని రాజీవ్ అడ్గగానే ‘ఈ ప్రశ్నకు నేను ఖచ్చితంగా సమాధానం ఇక్కడ చెప్పలేను. అదిగో అక్కడ నిర్మాతలు నావైపు గన్ ఎక్కుపెట్టిమరీ చూస్తున్నారు. ఈ సమాధానం నేను చెపితే నాపని అయిపోతుంది’ అనగానే ఆ అవార్డ్స్ ఫంక్షన్ కు వచ్చిన వారు అంతా తెగ నవ్వారని టాక్.
ఈఅవార్డు తీసుకోగానే రాజమౌళి మొదట తెలుగులో ‘నమస్కారం’ అంటూ మొదలు పెట్టి తాను ఎప్పుడు కెమెరాలు, లైట్లే జీవితంగా గడుపుతూ ఉంటాను అని అంటూ కానీ వాటి ఎదురుగా తానుంటే మాత్రం చాలా ఖంరుగా ఉంటుంది అంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నాడు రాజమౌళి. ఏదిఏమైనా కేంద్ర మంత్రులు పాల్గొన్న ఇలాంటి భారీ ఫంక్షన్ లలో కూడా కట్టప్ప వ్యవహారం చర్చకు రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది..