షాకింగ్ న్యూస్ గా మారిన శరత్ మరార్ కష్టాలు ?

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి బడా నిర్మాణ సంస్థలు టాప్ హీరోలు అంతా క్యూ కడుతూ ఉంటే పవన్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ను తీసి ఆ సినిమాను భారీ మొత్తాలకు ఈరోస్ ఇంటర్ నేషనల్ కు అమ్మి లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్న శరత్ మరార్ వ్యవహారానికి చెందిన కష్టాలు ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘సర్దార్’ సినిమాను కొనుక్కున్న బయ్యర్లకు మాత్రమే కాదు శరత్ మరార్ కు కూడ 8 కోట్ల నష్టాలు వచ్చాయి అంటే ఎవ్వరూ నమ్మలేని నిజం అని అంటున్నారు.

షాకింగ్ న్యూస్ గా మారిన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే మొదట్లో అనుకున్న ‘గబ్బర్ సింగ్ 2’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గా మారడానికి మధ్యలో వచ్చిన చాల పెద్ద గ్యాప్. శరత్ మరార్ కు ఈ ఊహించని నష్టాలు కలిగిమ్చై అని టాక్. ఈసినిమాకు దర్శకుడుగా సంపత్ నంది పనిచేసిన తరువాత అతడిని తప్పించి దర్శకుడు బాబీకి ఈ ప్రాజెక్ట్ ను ఇవ్వడంతో సంపత్ నందికి ఇచ్చిన అడ్వాన్స్ అంతా వృథా అయింది అని టాక్. 

అదేవిధంగా ఈ సినిమాకు కొంత కాలం సినిమాటోగ్రాఫర్ గా జయన్ విన్సెంట్ పనిచేసిన తరువాత అతడిని తప్పించి అతడి స్థానంలో అర్తుర్ విల్సన్ ను నియమించడంతో శరత్ మరార్ కువారికిచ్చిన  భారీ మొత్తాలు పోగొట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈసినిమాకు కొంత కాలం ఆనంద సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన తరువాత ఆయన స్థానంలో బ్రహ్మ కడలిని నియమించడంతో పాటు హీరోయిన్ గా అనిషా ఆoబ్రోస్ మొదటిగా అనుకుని ఆతరువాత ఆమె స్థానంలో కాజల్ ను తీసుకోవడం కూడ శరత్ మరార్ కు ఆర్ధికంగా నష్టాలు కలిగించాయని టాక్. 

దీనికితోడు ఈసినిమా ప్రారంభం అయిననాటి నుండి రకరకాల కారణాలతో వాయిదా పడుతూ ఉండటంతో పెరిగిన గ్యాప్ వడ్డీల విషయంలో కూడ శరత్ మరార్ కు భారీ నష్టాలు కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఈ సినిమాను కొనుక్కున్న బయర్లకే కాదు ఈసినిమాను నిర్మించిన శరత్ మరార్ ను కూడ కష్టాలలోకి నెట్టేసింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: