స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా సరైనోడు.. ఓ పక్క ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటే మరో పక్క సినిమా లీక్ అంటూ చిత్రయూనిట్ చేస్తున్న హడావిడికి ప్రేక్షకులు బుర్రలు హీటెక్కుతున్నాయి.. ఓ రెండు మూడు రోజులుగా సరైనోడు టీంకు షాక్ ఇస్తూ సినిమాలోని కొంత భాగం లీక్ అయినట్టు సమాచారం.
సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ :
అయితే ఈ లీక్ బాగోతాన్ని ముందే కనిపెట్టిన గీతా ఆర్ట్స్ టీం వెంటనే ఆ బ్లాగ్స్ అన్నిటిని డిలీట్ చేసిందట. అయితే సరైనోడు సాంగ్స్ విషయంలో కూడా ఇలా లీక్ అంటూ గోల చేసిన సరైనోడు టీం చూస్తుంటే ఇదో ప్రచారంలో భాగంగా చేస్తుందేమో అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా స్టార్ హీరో సినిమా లీక్ అయితే ఆ విషయం చిత్రయూనిట్ చెప్పేదాకా ఆడియెన్స్ తెలుసుకునే ఛాన్స్ ఉండదు. నిత్యం నెట్ మీద ఉండే వారు ఆ లీక్ బాగోతాలను బయటపెట్టేవారు.
ఒకవేళ సరైనోడు నిజంగా లీక్ అయ్యిందా లేక సరైనోడుకి ఆడియెన్స్ లో సింపతి రావాలని ఇలా లీక్ బాగోతం ఆడుతున్నారా అని కొద్నరు అభిప్రాయపడుతున్నారు. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాల్లో అల్లు అర్జున్ సరైనోడు సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమా హిట్ చేసుకోవడం కోసం సినిమా దర్శక నిర్మాతలు మరి ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారా అన్న సందేహం వస్తుంది.
సరైనోడులో అంజలి :
తెలుగులో ఏ స్టార్ హీరో కొట్టని వరుసెంట మూడు 50 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో తన స్టామినా ఏంటో రుజువు చేసుకున్న బన్ని సరైనోడు విషయంలో ఇలాంటి జిమ్మిక్కులు చేయడం ఏమాత్రం అభిమానులు సంతృప్తి చెందట్లేదు. అంతేకాదు ఓ రకంగా సినిమా మీద ఇదో బ్యాడ్ టాక్ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో లీక్ అనే విషయాన్ని పక్కన పెట్టి సినిమాను గట్టిగా ప్రమోట్ చేసి సినిమా హిట్ కొట్టేస్తే మంచిది.