ఒక ప్రముఖ తెలుగు మ్యూజిక్ టీవీ ఛానల్‌కు చెందిన యాంకర్ నిరోష ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు ఛానల్స్ లో ప్రముఖ మ్యూజిక్ ఛానల్ గా పేరుగాంచిన ఆ ఛానల్ లో నిరోష అనేక కార్యక్రమాలను ప్రజెంట్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇదే మ్యూజిక్ ఛానల్ కు చెందిన మరో యాంకర్ నిరోషా సికింద్రాబాద్‌లోని సింధి కాలనీలోని ఓ లేడీస్ హాస్టల్ ఉంటోంది అని తెలుస్తోంది.
బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిరోష తన ప్రియుడితో మాట్లాడినట్లు ఆమె తోటి యాంకర్ చెపుతున్నట్లు టాక్. ఈమె ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని తెలుస్తోంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఉరివేసుకున్న హుక్ బిగుసుకుపోవడంతోనే ఆమె చనిపోయినట్లు ఆమె రూంమేట్‌గా ఉన్న మరో యాంకర్ చెపుతున్నట్లు సమాచారం.
యాంకర్ నిరోషా తల్లిదండ్రులు బెంగుళూరులో ఉంటారని తెలుస్తోంది. కుమార్తె ఆత్మహత్య విషయం తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు మ్యారేజ్ ఎంగేజిమెంట్ కూడా అయ్యింది అని అంటున్నారు. ఆమె వీడియో కాల్ మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరగడంతో దాంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి కాల్ పెట్టేసిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే మరో నెల రోజుల్లోనే పెళ్లి జరగాల్సి ఉండగా ఆమె ఇప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషయమై దర్యాప్తు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏమైనా ఈమధ్య కాలంలో సినిమా రంగంలో అదేవిధంగా టెలివిజన్ రంగంలో పనిచేస్తున్న ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం సంచలనంగా మారడమే కాకుండా వీరి జీవితాలకు సంబంధించి ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్ధం అవుతుంది..