శైలజకు ఊహించని షాక్ ఇచ్చిన మహేష్ !

Seetha Sailaja
2016 ప్రారంభం అవుతూనే టాలీవుడ్ సినిమా రంగానికి హిట్ సెంటిమెంట్ తో మొదలైన విషయం తెలిసిందే. రామ్ హీరోగా వచ్చిన ‘నేను శైలజ’ ఊహించని ఘన విజయాన్ని సాధించడమే కాకుండా ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కు మంచి పేరు తీసుకు వచ్చింది. ఈ యంగ్ హీరోయిన్ లుక్స్ చూసి ఎదో ఒకరోజు ఈ బ్యూటీ టాప్ హీరోయిన్ అవుతుంది అంటూ కామెంట్స్ వ్రాసారు. 

ఈ కామెంట్స్ వచ్చి నెలరోజులు గడవకుండానే కీర్తి సురేష్ కు ఊహించని అదృష్టం తలుపు తట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం మురగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించబోయే సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమధ్య ఈ బ్యూటీ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తాను మహేష్ తో నటించాలని కోరుకుంటున్నానని చెప్పింది. 

ఆ మాటలు అన్న కొద్ది రోజులకే ఆమెకు ఈ ఆఫర్ రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఎంపిక వెనుక ఒక విచిత్రమైన ట్విస్ట్ కూడ ఉంది. విజయనిర్మల మనవడు సీనియర్ నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ నటిస్తున్న సినిమా ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమా ప్రారంభం రోజున కీర్తి సరేష్ ను ఆ సినిమా ప్రారంబోత్సవానికి వచ్చిన మహేష్ కీర్తిని చూసాడట. అప్పుడే ఆ బ్యూటీ మహేష్ ను ఆకర్షించింది అని టాక్. ఆ తరువాత  ‘నేను శైలజ’ విడుదల కావడం ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మహేష్ మైండ్ లో కీర్తి సురేష్ పూర్తిగా ఫిక్స్ అయింది అని అంటున్నారు. 

ఆ తరువాత మురగదాస్ మహేష్ ల మధ్య జరిగిన హీరోయిన్ ఎంపిక చర్చలలో అనేక మంది బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు చర్చకు వచ్చినప్పుడు వారందరినీ కాదని మహేష్ ప్రత్యేకంగా కీర్తి సరేష్ ను ఎంపిక చేసాడు అని టాక్. లేటెస్ట్ గా ఈమె రామ్ చరణ్ దృష్టిలో పడినట్లుగా కూడ వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈ సంవత్సరాంతానికి ఈమె టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరిపోయినా ఆశ్చర్యం లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. ఏమైనా ‘నేను శైలజ’ సినిమా అటు రామ్ కు ఇటు కీర్తి సరేష్ కు కెరియర్ టర్నింగ్ పాయింట్ గా మారింది .



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: