ఆశక్తి కలిగిస్తున్న పవన్ చంద్రబాబుల పంచాయితీ !

Seetha Sailaja
దీపావళి టపాసుల హడావిడి పూర్తి అయిన తరువాత ఈరోజు పవన్ ఆటంబాoబు మరోసారి హడావిడి చేయబోతోంది. ఈరోజు పవన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవబోతూ ఉండటం సర్వత్రా ఆశక్తిని రేపుతోంది. అయితే అమరావతి శంఖుస్థాపనకు కూడ రాని పవన్ ఈరోజు పనిగట్టుకుని చంద్రబాబును విజయవాడలో కలవడం వెనుక పెద్ద ఎజెండా ఉంది అని అంటున్నారు. 

విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం రాజధాని నిర్మాణం భూసేకరణ రైతుల పరిస్థితి పై చర్చలు జరిపే అవకాశం ఉంది. దీనితో పాటు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ప్రత్యేక హోదా అంశం కూడా చర్చకు వచ్చే ఛాన్స్  ఉందని అంటున్నారు. రాజధాని ప్రాంతంలో దాదాపు 300 ఎకరాలకు సంబంధించి ఉండవిల్లి, పెనుమాక, బేతం పూడి గామాలకు చెందిన చిఇన రైతులు తమ పై భూసేకరణ నిమిత్తం వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక మళ్ళీ ఈమధ్య పవన్ ను ఆశ్రయించారు అనే వార్తలు వస్తున్నాయి. 

ఈవార్తల నేపధ్యంలో పవన్ ఈ రైతుల విషయంలో చంద్రబాబుకు ఏమైనా నచ్చచెప్పి ఒక పరిష్కారం తీసుకు వస్తాడా ? లేదంటే ఒక మొక్కుబడిలా మాత్రమే ఈ పంచాయితీ మిగిలి పోతుందా అనే విషయం పై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ తిరిగి తన మౌనాన్ని ఈరోజు వీడబోతు ఉండటంతో జనసేన అధినేత చంద్రబాబును ఏమి ప్రశ్నిస్తాడు అన్న విషయం పై పవన్ అభిమానులు కూడ చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈరోజు ఉదయం విజయవాడకు చేరుకున్న తరువాత పవన్ రాజధాని భూమి రైతులను కలుసుకుని ఆ తరువాత చంద్రబాబును కలుస్తున్న నేపధ్యంలో ఈ చిన్న రైతులకు పెద్ద ప్యాకేజి ఇప్పించే విషయం కూడ ఈ చర్చలలో రాబోతున్నట్లు టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: