మనీ: రైతు జీవితాన్నే మార్చేసిన ఐడియా.. రూ.50 వెలు ఖర్చు రాబడి.. రూ.2.50 లక్షలు..!
చాలామంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి పట్టణాలకు వెళ్లి ఏదో ఒక చిన్న పనులను చేసుకుంటున్నారు. మరి కొంత మంది వ్యవసాయం చేస్తున్న పెద్దగా లాభాలు లేవని ఏదైనా పంట పండించాలంటే అందుకు తగ్గ అనుభవం కూడా ఉండాలి.. అయితే కొంతమంది యువ రైతులు సీజన్ కి తగ్గట్టుగా పంటలను పండిస్తూ భారీగానే లాభాలను అందుకుంటున్నారు. రాయ్ బరేలీ జిల్లాకు చెందిన విజయకుమార్ అనే వ్యక్తి తమ పూర్వీకుల పొలంలో వ్యవసాయాన్ని చేసేవారు.. కానీ అతను బంధువులలో ఒకరు హార్టికల్చర్ కోర్స్ తీసుకున్నారట.
అలా పవన్ వర్మ ఒక కార్యక్రమంలో అక్కడికి వచ్చినప్పుడు తనకు పుచ్చకాయల పండించమని సూచించారట. ఆయన సలహా మేరకు ఆ పంటను వేశారు విజయకుమార్.. ఈ సాగులో తక్కువ ఖర్చుతో అధిక లాభం ఉండడంతో ఇతర పంటల పోలిస్తే మంచి లాభాదాయకంగా ఉన్నదట. ముఖ్యంగా వేసవికాలంలో వీటికి మంచి గిరాకీ ఉండడం వల్ల అధిక ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. కేవలం ఎకరా పొలంలో రూ .50 నుంచి 60 వేల రూపాయల ఖర్చు చేశారట.. అలా ఖర్చులు మొత్తం తీసేసి దాదాపుగా తనకి రూ.2.5 లక్షల రూపాయలు లాభం వచ్చిందని తెలియజేశారు మిగతా పంటల కంటే ఈ పంట మంచి లాభాలను ఇచ్చిందని విజయ్ వెల్లడించారు. తన పుచ్చకాయలను లక్నో మార్కెట్లో పంపుతూ మంచి లాభాలను అందుకున్నారు..