మనీ: కరువు నేలలో కూడా లక్షలు సంపాదించే బిజినెస్..!!

Divya
వ్యవసాయం చేస్తూ కూడా లక్షలలో మనం సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా మార్కెట్లో ఏ పంటకు మంచి డిమాండ్ ఉందనే విషయాన్ని తెలిస్తే చాలు వాటిని సాగు చేస్తూ ఉంటాము. అలా పత్తి, కందులు, మిరపకాయలే కాకుండా కాయగూరలను కూడా చాలామంది సాగు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎక్కువగా గోధుమ గడ్డి లేదా నిమ్మగడ్డి వంటివి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం వల్ల వాటిని కూడా వేస్తూ ఉంటారు. ముఖ్యంగా గోధుమ గడ్డి జ్యూస్ తాగితే కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే నిమ్మగడ్డి కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి.

నిమ్మగడ్డి నాలుగు నెలల్లో చేతికి వస్తుంది. దీని నూనె కూడా మార్కెట్లో మంచి లాభదాయనికంగానే ఉన్నది. ముఖ్యంగా మహిళలు వాడే బ్యూటీ ప్రాడక్టులు, సబ్బులు, మందుల తయారీలలో కూడా ఈ నిమ్మగడ్డి నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఈ గడ్డి సాగు చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. నిమ్మగడ్డి పంట పొడి వాతావరణం లో ఉండే పలు ప్రాంతాలలో చాలా అనుకూలంగానే పండుతుంది. కరువు ప్రభావిత ప్రాంతాలలో కూడా వీటిని మనం సాగు చేసుకోవచ్చు. ఈ నిమ్మ గడ్డికి ఎలాంటి ఎరువులు నీటి వినియోగం పెద్దగా అవసరం ఉండదు.

నిమ్మగడ్డి ఎకరాకు పదివేలకు మించి తక్కువ పెట్టుబడితో సంవత్సరానికి 4 నుంచి 5 లక్షల వరకు లాభాదాయాన్ని మనం పొందవచ్చు.. ఒకసారి పంట వేస్తే నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఆదాయాన్ని ఇస్తుంది. నిమ్మగడ్డి పెంపకానికి బాగా అనుకూలమైన నెల ఫిబ్రవరి నుంచి జూలై నెల మధ్యలో ఈ పంటను బాగా వేసుకోవచ్చు. ఒకసారి పంట వస్తే ఏడాదికి 6 నుంచి ఏడుసార్లు కూడా కోత వస్తుందట.ఈ గడ్డి నుంచి సువాసన వస్తుంది అంటే అది కోతకు వచ్చినట్లుగా మనం గుర్తించాలి. ఈ నిమ్మగడ్డి నుంచి నూనె తీసి బయట మార్కెట్లో విక్రయించడం వల్ల మంచి లాభాలను అందుకోవచ్చు. ఒక్కో ఎకరానికి ఒకసారి కోస్తే ఐదు లీటర్ల నూనె ఉత్పత్తి అవుతుందట.. దీని ధర మార్కెట్లో 1500 కు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: